నిరశన అస్త్రంగా నామినేషన్లు
posted on Feb 24, 2021 @ 6:49PM
ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టంలోనే అధికార తెరాసకు నిరసన సెగలు తాకాయ అంటే అవుననే అంటున్నారు నిరుద్యోగ పట్ట భద్రులు. నామినేషన్ల చివరి రోజు అధికార పార్టీ అభ్యర్ది పల్లా రాజేశ్వర రెడ్డితో సహా మొత్తం 28 మంది నామినేషన్’ దాఖలు చేశారు. అలాగే, మొత్తంగా నామినేషన్లు ముగిసే సమయానికి 76 మంది నామినేషన్ దాఖలు చేశారు.
గత ఎన్నికలలో 22 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా ఈ సారి ఎన్నికల్లో అంతకు మూడున్నర రెట్లు మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు.ఈరోజు నామినేషన్ పత్రాల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉసంహరణకు ఈ నెల 26 ఆఖరు తేదీ, సో ... ఆపాటికి గానీ చివరకు ఎంత మంది బరిలో మిగులుతారు అనేది తేలదు.
అయితే ఇంత పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు కావడానికి కారణం నిరుద్యోగ పట్టభద్రుల్లో ప్రభుత్వ పట్ల పెల్లుబుకుతున్నవ్యతిరేకతే కారణమని అంటున్నారు. గతంలో నిజామాబాద్ లో పసుపు రైతులు ప్రభుత్వ విధానాల పట్ల తమా వ్యతిరేకతను, ఆగ్రహాన్ని అధిక సంఖ్యలో నామినేషన్లు
దకాహాలు చేయడం ద్వారా వ్యక్త పరిచారు. ఇప్పడు కూడా, తెలంగాణ ఉద్యమానికి మూల కారణాల్లో ఒకటైన నియామకాల విషయంలో తెరాస ప్రభుత్వం విఫలమైందని చెప్పేదుకే ఇంట పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యుకలు నామినేషన్లు వేశారు. నామినేషన్ వేసిన వారంతా పోటీకి నిలుస్తారా లేదా అనేది పక్కన పెడితే నిరుద్యోగ యువతలో రగులుతున్న వ్యతిరేకతకు మాత్రం ఇదొక నిదర్శనంగా భావించవచ్చును