టి.టి.డి. ఛైర్మన్ కోసం పైరవీలు
posted on Aug 25, 2012 9:11AM
ఈనెల 25 తో టిటిడి పాలకమండలి పదవీ కాలం ముగియ నుండటంతో దీనిపై ప్రస్తుత ఛైర్మన్, కనుమూరితో పాటు రాయపాటి సాంబశివరావు, టి సుబ్బిరామిరెడ్డి, ఆదికేశవుల నాయుడు ప్రయత్నింస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ విషయంలో రాహుల్‌గాంధీ నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రితో సిఫారసు చేస్తారు. టిటిడి నిబంధనల ప్రకారం ఆయనకు రెండు సంవత్సరాల పదవీ కాలం ఉంది. అయితే 2011 లో ఆగస్టులో కనుమూరిని చైర్మన్‌గా చేస్తూ ఇచ్చిన జివోలో బాపిరాజు ఆగస్టు 25 తేదీవరకు మాత్రమే పదవిలో ఉంటారని పేర్కొన్నారు. బాపిరాజుకు రెండేళ్ల పదవీ కాలం ఇవ్వనందున మరో అవకాశం ఇవ్వవలసిందిగా కోరుతున్నారు.లేదంటే సెప్టెంబరులోజరిగే బ్రహోత్సవాల వరకైనా ఉంచాలని కోరుతున్నారు. రాయపాటి 2004 నుండి టిటీడీ చైర్మన్ పదవికోసం రాజీలేకుండా పైరవీ చేస్తున్నారు.టిసుబ్బిరామిరెడ్డి,ఆదికేశవుల నాయుడును నియమించినప్పుడు కూడా రాయపాటి రేసులో ఉన్నారు. కాకపోతే వీరిరువురూ రెండు సార్లు టిటిపి చైర్మన్లగా పని చేశారు. టిటిడి నిబంధనలమేరకు ఒక వ్యక్తి కేవలం రెండు సార్లు మాత్రమే చైర్మన్‌గా కొన సాగటానికి అవకాశం ఉంది. అంతకు మించి చేయాలంటే టిటీడి చట్టాన్ని మార్చవలసి వస్తుంది. కాబట్టి సుబ్బిరామిరెడ్డి, ఆదికేశవులకు అవకాశం అంతంత మాత్రమే అని తెలిసింది.