హజీ అలీ దర్గాలోకి తృప్తి దేశాయ్.. దర్గా గర్భాలయంలోకి ప్రవేశిస్తా..
posted on May 12, 2016 @ 11:27AM
భూమాత బ్రిగేడ్ సంఘ అధ్యక్షురాలు లింగబేధ వివక్ష మీద పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు ఆలయాల్లో మహిళలకు అనుమతి లేని నేపథ్యంలో పోరాడి విజయం సాధించారు. తాజాగా ముంబైలోని హజీ అలీ దర్గాలోకి కూడా ప్రవేశిస్తామని చెప్పిన సంగతి విదితమే. ఈ విషయంలో ఆమెపై విమర్శలు కూడా చేశారు. అయితే ఇప్పుడు తృప్తి దర్గాలోకి ప్రవేశిస్తే ఊరుకోబోమంటూ వచ్చిన హెచ్చరికల నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే దర్గా గర్భాలయంలోకి తృప్తి దేశాయ్ ప్రవేశించలేదు. దర్గా వద్ద ప్రార్థనలు నిర్వహించిన ఆమె అనంతరం మాట్లాడుతూ... త్వరలోనే మహిళలు దర్గా గర్భాలయంలోకి ప్రవేశిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.