రఘునందన్ వెనుక సీఎం కిరణ్
posted on May 22, 2013 @ 1:29PM
''మొదట పద్మాలయ స్టూడియో వ్యవహారంలో డబ్బు తీసుకున్నారని ఆరోపించిన రఘునందన్ తర్వాత సినీమాక్స్, రాజీవ్ రహదారి, ఎమ్మార్ అంటూ రోజుకో మాట మాట్లాడుతున్నాడు. టీఆర్ఎస్ నేతలు అవినీతికి పాల్పడ్డారంటూ చాలా ఆరోపణలు చేశావు. సీడీలు, సీసీ పుటేజిలు చాలా ఆధారాలు ఉన్నాయన్నావు. ఉంటే ఎక్కడికి పోయాయి ? వాటిని ఎందుకు బయట పెట్టలేదు ? నిజాయితీ ఉంటే ఆరోపణలు నిరూపించు. సీబీఐతో కాదు అంతర్జాతీయ దర్యాప్తు ఏజెన్సీలతో విచారణకు టీఆర్ఎస్ సిద్దం” అని టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు. రఘునందన్ వ్యవహారం చూస్తుంటే ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కనుసన్నలలో పనిచేస్తున్నారని తేలిపోయింది. టీఆర్ఎస్ నుండి ఎమ్మెల్సీలుగా ఎన్నికయిన స్వామి గౌడ్, సుధాకర్ రెడ్డిలకు గన్ మెన్లు కావాలని ధరఖాస్తు చేసుకుని 45 రోజులు గడుస్తుంది. ఇప్పటికీ గన్ మెన్లను కేటాయించలేదు. రఘునందన్ డీజీపీని కలిసిన మరుసటి రోజే ఆయన ఇంటికి గన్ మెన్లను పంపారు. తెరవెనుక ముఖ్యమంత్రి ఈ ఆరోపణలు చేయిస్తున్నారని తేలిపోయిందని ఆయన విమర్శించారు.