గవర్నర్‌కి అధికారాలు వద్దు: టీఆర్ఎస్ ఎంపీలు
posted on Aug 21, 2014 @ 3:35PM
టీఆర్ఎస్ ఎంపీలు గురువారం నాడు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ని కలిశారు. రాష్ట్ర విభజన బిల్లులో స్పష్టంగా పేర్కొన్న విధంగా హైదరాబాద్‌లో శాంతిభద్రతల అంశాన్ని గవర్నర్ చేతిలో వుంచడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని, అలా చేయడానికి వీల్లేదని టీఆర్ఎస్ ఎంపీలు రాజ్‌నాథ్‌సింగ్‌కి విజ్ఞప్తి చేశారు. గవర్నర్‌కి ప్రత్యేక అధికారాలు ఇవ్వడం అంటే తెలంగాణ రాష్ట్ర హక్కులను హరించడమేనని వారు పేర్కొన్నారు. సెక్షన్ - 8 కింద రాష్ట్ర అధికారాలు లాక్కోవడం సరికాదని వాదించారు. ఎన్డీయే ప్రభుత్వం సమాఖ్య విధానాన్ని గౌరవించాలని చెప్పారు. అయితే అయితే చట్ట ప్రకారమే గవర్నర్ నిర్ణయాలు తీసుకుంటారని రాజ్‌నాథ్ సింగ్ ఈ సందర్భంగా వారికి చెప్పారు. తాము విభజన చట్టంలో వున్న అంశాన్ని అమలు చేయాలని అనుకుంటున్నామే తప్ప సమాఖ్య విధానానికి ఎంతమాత్రం వ్యతిరేకంగా వెళ్ళడం లేదని వారితో అన్నారు.