కేసీఆర్ ని ఉతికారేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే..
posted on Apr 2, 2021 @ 9:36AM
ఆయన ఒక ప్రజా ప్రతినిధి. తనకు నోటి దురుసు ఎక్కువ. అందుకే ఎప్పుడు ఏదో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు.. అవగాహన లేకనో, లేక మైక్ ముందు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడకపోతే పరువుపోతుందనో లేక కావాలనే మనసులో మాట మాట్లాడుతారో గానీ.. అప్పుడప్పుడు వాస్తవాలు మాట్లాడుతుంటారు.. ఇలాంటి ప్రజా ప్రతినిధులు చాలా మంది ఉన్నారు. ఈ మధ్య కాలంలోనే దళితులపై నోరుజారిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. ఈ సారీ ఏకంగా టీఆర్ఎస్ పార్టీ పెద్ద దిక్కు ముఖ్యమంత్రి కేసీఆర్ నే ఉతికిపారేశాడు.ఉద్దేశాన్నే బయటపెట్టేశారా? లేదా పొరపాటున అన్నారా? అనేది ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
తాజాగా పరకాల నియోజకవర్గం కంఠాత్మకూరులో పర్యటించిన ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఢిల్లీ కేంద్రంగా 140 రోజుల నుంచి రైతులు ఉద్యమం చేస్తున్నా.. ప్రధానమంత్రి మోదీ, కేసీఆర్‌లు పట్టించుకోని పుణ్యాత్ములంటూ వ్యాఖ్యనించడం సొంత పార్టీలోనూ మీడియా లోను దుమారం లేపుతుందనే చెప్పాలి . ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇది ఇలా ఉండగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నోరు జారితే జారాడు గానీ.. నిజమే మాట్లాడాడంటూ.. నోరు ఉండి, నిజం మాట్లాడలేని టీఆరఎస్ పార్టీ నాయకులు అనుకుంటున్నారని. ప్రతిపక్షాల్లోనూ ప్రజల్లోనూ అదే వాస్తవం అనే మాట వినిపిస్తున్నాయి.