కొనసాగుతున్నకేసిఆర్ ర్యాలీ..ఒంటెపై హరీష్
posted on Feb 26, 2014 @ 6:37PM
కేసీఆర్ రాకతో బేగంపేట నుంచి గన్ పార్క్ వరకూ పెద్ద పండుగ వాతావరణం నెలకొన్నది. అభిమానులు గులాబి పూలతో కేసీఆర్‌కు ఘన స్వాగతం పలికారు. దారి పొడవునా కేసీఆర్ ప్రజలకు అభివాదం చేస్తూ ప్రత్యేక వాహనంలో ముందుకు కదిలారు. కేసీఆర్‌ను చూడడంతోనే ప్రజలు జై తెలంగాణ అని నినాదించారు. బేగం పేట విమానాశ్రయం నుంచి గన్ పార్క్‌కు బయలుదేరిన ర్యాలీకి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం క్యాంపు ఆఫీసు, పంజగుట్ట, నిమ్స్, ఖైరతాబాద్, లక్డీ కా పూల్ మీదుగా ఈ ర్యాలీ గన్ పార్క్‌కు చేరుకుంటుంది. టీఆర్ఎస్ నాయకుడు హరీశ్‌రావు ఒక ఒంటెపై ఎక్కి కూర్చుని ర్యాలీలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు అందరూ వేర్వేరు వాహనాలలో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రజలు అడుగడుగునా వారికి బ్రహ్మరథం పట్టారు.