మంటల్లో తెలంగాణ భవన్
posted on Mar 20, 2021 @ 7:03PM
టీఆర్‌ఎస్ కార్యకర్తల అత్యుత్సాహం కారణంగా తెలంగాణ భవన్‌లో మంటలు చెలరేగాయి. హైదరాబాద్ప- రంగారెడ్డి- మహబూబ్ నగర్ ట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్‌ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి విజయం సాధించారు. దీంతో తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. పటాకులు కాల్చారు. కొంతమంది కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించి బాణాసంచా కాల్చారు. బాణాసంచా నిప్పు రవ్వలు తెలంగాణ భవన్ పై పడ్డాయి. దీంతో పైకప్పు తగలబడింది. తెలంగాణ భవన్‌లో మంటలు భారీగా ఎగసిపడ్డాయి.
ఈ ప్రమాదంలో మంటలు భారీ ఎత్తున చెలరేగాయి. తెలంగాణ భవన్ లో ఓ అంతస్తు దగ్ధవుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్నాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన తెలంగాణ భవన్ వద్దకు చేరుకుని మంటలను ఆర్పేందుకు శ్రమించారు. కార్యకర్తల అత్యుత్సాహమే ఈ ప్రమాదానికి దారితీసిందని భావిస్తున్నారు. తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగిన పీవీ నరసింహరావు కుమార్తె సురభి వాణీదేవి తన సమీప ప్రత్యర్థి రాంచందర్ రావుపై నెగ్గారు.