షర్మిల కార్ వ్యాన్ దగ్ధం.. తెరాస దాడులకు బెదిరేలేదంటూ వైఎస్సార్ టీపీ ధర్నా
posted on Nov 28, 2022 @ 2:25PM
తెలంగాణలో అధికారంలో ఉన్న తెరాస సర్కార్ విమర్శను సహించలేకపోతున్నది. ప్రభుత్వాన్ని విమర్శించే వారు రోడ్లపై తిరగడానికి వీల్లేదన్నట్లుగా ఆంక్షలు విధిస్తోంది. బండి సంజయ్ ఐదు విడత పాదయాత్రను అడ్డుకోవడమే కాకుండా బండి సంజయ్ ను హౌస్ అరెస్టు చేసింది. అదే రోజు వరంగల్ జిల్లా నర్సంపేట కొనసాగుతున్న వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల పాదయాత్రపై తెరాస కార్యకర్తలు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఆమె వాహనశ్రేణిలోని కార్ వ్యాన్ ను దగ్థం చేశారు.
వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలంగాణ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర సాగిస్తున్న సంగతి తెలిసిందే. ఆ పాదయాత్రలో భాగంగా సోమవారం వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో ఆమె పాదయాత్ర సాగిస్తున్నారు. వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలంగాణ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర సాగిస్తున్న సంగతి తెలిసిందే. ఆ పాదయాత్రలో భాగంగా సోమవారం వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో ఆమె పాదయాత్ర సాగిస్తున్నారు. తన పాదయాత్రలో భాగంగా ఆమె ఏ నియోజకవర్గంలో పర్యటిస్తుంటే ఆ నియోజకవర్గ సమస్యలను ప్రస్తావిస్తున్నారు. అలాగే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే వైఫల్యాలను ఎత్తి చూపుతున్నారు.
ప్రధానంగా ఆమె తెరాస అగ్రనేతలను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె సోమవారం వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. చెన్నారావు పేట మండలం లింగగిరిలో లంచ్ బ్రేక్ కు ఆగారు. ఆ సమయంలో తెరాస కార్యకర్తలు రెచ్చిపోయారు. ఆమె పాదయాత్ర వెంట వస్తున్న వాహనాలపై రాళ్ల దాడి చేశారు. అనంతరం షర్మిల కార్ వ్యాన్ ను దగ్ధం చేశారు.
ఈ ఘటనపై షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులతో, వాహనాల దగ్ధాలతో తనను బెదరించలేరని పేర్కొన్నారు. కాగా తెరాస కార్యకర్తలు దాడి చేస్తుంటే, వాహనాన్ని దగ్ధం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా దాడి, కార్ వ్యాన్ దగ్ధం ఘటనలకు నిరసనగా అక్కడే వైఎస్ఆర్ టీపీ శ్రేణులు ధర్నాకు దిగారు. ఈ ధర్నాలో షర్మిల కూడా పాల్గొన్నారు.