అకోండ్రోప్లాసియా...
posted on Dec 21, 2021 @ 9:30AM
కొన్ని కొన్ని పేర్లు మ్సామాన్యులకు అర్ధం కాదు. మరీ వైద్య పరిభాష అర్ధం కాదు. అందులో భాగంగా
అకోండ్రోప్లాసియా ఒకటి వివరణ...
అకోండ్రోప్లాసియా అనేది ఒక జన్యు పరమైన రుగ్మత . ఇందులో ఎముకల లో పెరుగుదల లోపం కారణం కావచ్చు. లేదా జన్యుపరంగా వచ్చే మార్పులు కారణం కావచ్చని అంచనా దీనికారణంగా వచ్చిన స్థితిని మరగుజ్జు తత్వంగా పేర్కొన్నారు.అచోన్ ద్రోప్లసియా వల్ల కీళ్లలో వికృత రూపం వస్తుంది. అదీకాక కండరాలు బలహీనంగా ఉండడం లేదా ఎదగక పోవడం వల్ల ఒక్కోసర్రి మరించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.చాలామంది నిద్రావస్థలో ఉన్నప్పుడే మరణించారు దీనికిగల కారణాలలో వెన్నుపూస పై భాగం ఒత్తుకు పొయి ఉండవచ్చని దీనికి మరోకారణం గా పుర్రె లో అసాధారణ గా ఫోర్మేన్ మాగ్నమ్ లలో ఉండడమే అనిపెర్కొన్నారు.ఇది వెన్నెముక కు అనుసంధానం చెయబడి పనిచేస్తూ ఉంటుంది.అలాగే వెన్నుపూస మరియు మెడ భాగానికి కలపబడి ఉంటుంది.
అకోండ్రోప్లాసియా లక్షణాలు...
శరీరంలో ఉన్న వివిదరకాల అవకరాలు వల్ల పెద్దలలో సహజంగా మొత్తం మీద ఎత్తు నాలుగు అడుగులే. అచోస్ ద్రోప్లసియా ఉన్నవారిలో పొట్టి కాళ్ళు చేతులు,వారి మొండెం సైజు మామూలుగానే ఉంటుంది.చేతి పై భాగం, చేతుల కన్నా తొడలు చాలా పొట్టిగా ఉంటాయి.వారి ముక్కు సైతం చాలా బల్లపరుపుగా ఎత్తుపల్లా లుగా ఉంటాయి. ఈ వ్యాధితో బాధపడే వారి చేతి వెళ్ళు పొట్టిగా ఉంటాయి మూడు నాల్గవ వేలి మధ్య ఒక త్రిశూలం ఆకారం లో ఉంటుంది
అకోండ్రోప్లాసియా కు చికిత్స...
ఈ అచోన్ ద్రో ప్లేసియా సమస్యకు ప్రత్యేకమైన చికిత్స అంటూ లేదు. శారీరకంగా వచ్చే పెరుగుదల లేదా అవలక్షణాలను ముఖ్యంగా .వైకాల్యాలను శస్త్ర చికిత్స ద్వారా చేయవచ్చు.