రేపు కూతురి బర్త్ డే.. ఈ రోజు ఫాదర్ డెత్ డే
posted on May 1, 2021 @ 9:58AM
ఓపెన్ చేస్తే.. వరంగల్ రూరల్ జిల్లా మడికొండ. అతని పేరు బండి రంజిత్ కుమార్. అతను పుట్టు మూగ. నాలుగేళ్ళ క్రితం రైల్వే రిక్రూట్‌మెంట్‌బోర్డు నిర్వహించిన పరీక్ష ద్వారా రైల్వేలో ఉద్యోగం సాధించాడు. రామగుండం రైల్వే రెగ్యులర్ ఓవర్‌హాలింగ్‌షెడ్డులో టెక్నికల్ అసిస్టెంట్‌గా చేరాడు. మూడు సంవత్సరాల క్రితం మూగ యువతినే వివాహమాడి ఆదర్శంగా నిలిచాడు. వీరికి ఒక కుతురు ఉంది. కరోనా విలయతాండవం చేస్తున్న క్రమంలో తన భార్య, కూతురును పుట్టింటికి పంపించారు.
రేపు ఆ పాప పుట్టినరోజు . ఆ వేడుకల్లో బంధువులంతా నిమగ్నమయ్యారు. అతను ఉద్యోగం చేస్తూ ఒక్కడే ఒంటరిగా కరీంనగర్ జిల్లా రామగుండంలో ఉంటున్నారు. రేపు తమ కూతరు పుట్టిన రోజంటూ తన తోటి ఉద్యోగులకు చెబుతూ తప్పకుండా రావాలంటూ చెప్పాడు.
కట్ చేస్తే.. విధినిర్వహణలో ఉండగా తనకు గుండె పోటు వచ్చింది. అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. తోటి ఉద్యోగులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్దారించారు. విషయం తెలసుకున్న భార్య, తన కూతురు కన్నీరుమున్నీరుగా విలపించారు. తెల్లారితే తన కూతరు పుట్టిన రోజు వేడుకలను చూద్దామనుకున్న అతడిని మృత్యువు వెంటాడింది. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
తోటి ఉద్యోగులు రైల్వే డిస్పెన్సరీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందనడంతో కరీంనగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా తెల్లారితే తన కూతురు మొదటి పుట్టిన రోజు ఉండగా తన భార్యకు ఫోన్ చేసి రామగుండం రావాలని చెప్పాడు. ఇంతలో ఇలా జరగడంతో తన భార్య బోరున విలపించింది. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి. రంజిత్ కుమార్ మూగ అయినా అందరితో కలిసిమెలిసి ఉండేవాడని తన తోటి స్నేహితులు తెలిపారు.