వ్యభిచార కూపం నుండి బయటపడ్డ మరో టాలీవుడ్ నటి
posted on Jun 3, 2015 @ 5:35PM
సినిమాలో హీరోయిన్ అయిపోదామని సినీరంగుల లోకంలో అడుగుపెడతారు అమ్మాయిలు. అదృష్టం కలిసివచ్చిందా సరే లేకపోతే పడే పాట్లు అలా ఇలా ఉండవు. ముందు మంచి అవకాశాలు వచ్చినా తరువాత రానివారు కూడా ఉన్నారు. కొంతమంది ఇదే అదను చూసుకొని వాళ్లను రాంగ్ రూట్ లోకి లాగడానికి కూడా చూస్తారు. అలా తన సహాయకురాలి ద్వారా వ్యభిచార కూపంలోకి లాగబడింది ఓ టాలీవుడ్ నటి. తెలుగు, హిందీ భాషల్లో నటించిన ఓ టాలీవుడ్ నటి వ్యభిచారం కేసులో పట్టుబడింది. వివరాల ప్రకారం ఆనటికి సినిమాఛాన్సులు తగ్గడం ద్వారా తనను వ్యభిచారం కూపంలోకి లాగడానికి ఓ పథకాన్ని రచించింది తన సహాయకురాలు ఆయేషా సయ్యద్. దీనిలో భాగంగానే ఆనటి, ఆమె కలిసి పణజిలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ కి చేరుకున్నారు. తరువాత కొంతసేపటికి ఓ బడాబాబు కూడా చేరుకున్నాడు. ఇంతలో సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే హోటల్ పై రైడింగ్ చేశారు. కానీ అతను తప్పించుకోవడంతో పోలీసులు నటిని, అయేషాను అదుపులోకి తీసుకున్నారు. అయితే తనను అయేషా బలవంతంగా వ్యభిచార కూపంలోకి లాగేందుకు ప్రయత్నిస్తుందని చెప్పడంతో అయేషాపై కేసు నమోదు చేసి నటిని రెస్యూ హోంకు తరలించారు. అయితే నటి పేరు మాత్రం పోలీసులు తెలుపలేదు.