ఏప్రిల్ 17న తిరుపతి, సాగర్ బై పోల్
posted on Mar 16, 2021 @ 4:37PM
తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి లోక్ సభ, తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలకు షెడ్యూల్ వచ్చేసింది. ఈ రెండు స్థానాలకు ఏప్రిల్ 17న పోలింగ్ జరగనుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈనెల 23న నోటిఫికేషన్ రానుండగా.. మార్చి 30 వరకు నామినేషన్లు స్వీకరణ.. 31న నామినేషన్ల పరిశీలన ఉంటుందని తెలిపింది. ఏప్రిల్ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుంది. 17న ఉప ఎన్నిక పోలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. మే 2న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు చనిపోవడంతో తిరుపతి లోక్ సభకు ఉప ఎన్నిక జరగనుంది. దుర్గాప్రసాద్ సెప్టెంబర్ 16న చనిపోయారు. ఆయన చనిపోయి మార్చి16కు ఆరు నెలలు అయింది. రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ప్రజా ప్రతినిధి చనిపోతే.. ఆ సీటుకు ఆరు నెలల్లోగా ఎన్నిక జరపాల్సి ఉంటుంది. అందుకే మార్చి16న ఎన్నికకు షెడ్యూల్ ఇచ్చింది సీఈసీ. తెలంగాణలోని నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న నోముల నర్సింహయ్య డిసెంబర్ 1వ తేదిన చనిపోయారు. దీంతో అక్కడ కూడా ఉప ఎన్నిక అనివార్యం అయింది.