ఘన విజయం సాధించిన తుమ్మల.. కారు జోరుకు కాంగ్రెస్ ఖతం..
posted on May 19, 2016 @ 12:34PM
పాలేరు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. 45, 750 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్ధి తుమ్మల నాగేశ్వరరావు ఘనం విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన దగ్గరనుండి తుమ్మల తన ఆధికత్యను కొనసాగిస్తూనే ఉన్నారు.. మరోవైపు టీఆర్ఎస్ కూడా తుమ్మల విజయంపై మొదట నుండి ధీమా వ్యక్తం చేస్తూనే ఉంది. దీంతో తమ అంచనాలకు తగ్గట్టుగానే పాలేరు ఉపఎన్నికి టీఆర్ఎస్ కైవసం అయింది. మొత్తం 17 రౌండ్లు ఓట్ల లెక్కింపు జరగగా.. లెక్కింపు ముగిసే సమయానికి తుమ్మల 45వేల 650 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. దీంతో తుమ్మల విజయం సాధించారు. అయితే అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మరోవైపు అప్పుడే టీఆర్ఎస్ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు.
ఇక ఈ ఉపఎన్నికకు తుమ్మలకు అభ్యర్ధిగా బరిలో దిగిన రాంరెడ్డి సుచరితా రెడ్డికి నిరాశే మిగిలింది. మొదటి నుండి చూపించిన కారు జోరు తాకిడికి కాంగ్రెస్ తట్టుకోలేక పోయింది. దీంతో ఓటమి చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా ఇప్పటి వరకూ రాష్ట్ర విభజన జరిగిన తరువాత తెలంగాణ ప్రభుత్వంలో మూడు ఉపఎన్నికలు జరుగగా మూడింటిని టీఆర్ఎస్ దక్కించుకుంది. ఇప్పుడు తాజాగా నాలుగో ఉపఎన్నిక స్థానాన్ని కూడా టీఆర్ఎస్సే కైవసం చేసుకుంది.