కీలకపాత్ర పోషిస్తున్న ముగ్గురు మహిళాధికారులు!
posted on Apr 10, 2020 @ 5:13PM
కరోనాపై జరుగుతున్న పోరాటంలో మనదేశంలో ముగ్గురు మహిళలు కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. గత రెండు నెలల నుండి ఆఫీసు లోనే నివాసముంటూ, కుటుంబాలను కూడా కలవలేకపోయిన ఈ ముగ్గురు భారత జాతికే కాకుండా ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారు.
ఐఎఎస్ అధికారిణి ప్రీతి సుడాన్. ప్రీతి సుడాన్ ఢిల్లీలో హెల్త్ సెక్రటరీగా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఈ ఐఎఎస్ ఆఫీసర్. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి పీజీ చేసి వరల్డ్ బాంక్ లో కూడా పని చేశారు. ఇప్పుడు కరోనా యుద్ధంలో నరేంద్ర మోడీ తో ప్రత్యక్షంగా పని చేస్తూ మన్ననలు పొందుతున్నారు. చైనా లోని వూహాన్ నుండి 645 మంది భారతీయుల ను స్వదేశానికి తీసుకురావడంలో కీలక భూమిక పోషించారు.
ప్రీతి సుడాన్ నూజివీడు సబ్ కలెక్టర్ గా మొదటి పోస్టింగ్ లో పనిచేశారు. ఆమె భర్త రణదీప్ సుడాన్, ఆయన కూడా ఐఎఎస్ అధికారి. అదే సమయంలో విజయవాడ సబ్ కలెక్టర్ గా పనిచేశారు. రెండూ ప్రక్కనే ఉన్న రెవెన్యూ డివిజన్లకు సబ్ కలెక్టర్‌లుగా పనిచేశారు. ఆ తరువాత ఆయన అప్పట్టి సిఎం చంద్రబాబు నాయుడు కార్యదర్శిగా పనిచేశారు. అతను ఐటి నిపుణుడు మరియు చంద్రబాబు నాయుడుతో పాటు ఎపిలో ఐటి అభివృద్ధికి కీలకపాత్ర పోషించారు.
ప్రీతి సుడాన్ తో పాటు డాక్టర్ నివేదిత గుప్త, సైంటిస్ట్ రేణు స్వరూప్ ఈ ముగ్గురు భారత జాతికే కాకుండా ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నారు.
డాక్టర్ నివేదిత గుప్త స్వయంగా MBBS అయిన ఈమె మాలిక్యులర్ మెడిసిన్ లో పీహెచ్‌డీ చేసి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
గతంలో డెంగ్యూ, చికెన్ గున్యా, సార్స్, నిఫా వైరస్ లను ఎదుర్కోవడంలో ఈమె కృషి ప్రపంచ దేశాలు ప్రశంసించాయి.
ఇప్పుడు కరోనా యుద్ధంలో పరీక్షా పద్ధతులు, గైడ్ లైన్స్ రూపొందించడమే కాకుండా దేశ వ్యాప్తంగా 182 లేబరేటరీలను కొద్ది రోజుల వ్యవధిలో నిర్మించారు. వీటికి అవసరమైన పరికరాలు, ముడి పదార్ధాలు, టెక్నీషియన్ల శిక్షణ మొదలైన వాటిని స్వయంగా పర్యవేక్షిస్తూ ప్రపందేశాలను సమన్వయం చేస్తున్నారు.
డాక్టర్ రేణు స్వరూప్ జెనెటిక్స్, ప్లాంట్ బ్రీడింగ్ లో పీహెచ్‌డీ చేసిన ఈ ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రవేత్త నరేంద్ర మోడీ గారి శాస్త్ర సలహాదారుల కమిటీలో సేవలందిస్తున్నారు. కరోనా పై యుద్ధంలో దేశవ్యాప్త పరిశోధనా సంస్థలు, పరిశ్రమలను సమన్వయం చేస్తూ మందులను, వాక్సిన్ ను తయారుచేయడంలో తలమునకలై ఉన్నారు. ఈమె 2001, 2007, 2015 లో రూపొందించిన బయో టెక్నాలజీ విజన్ డాక్యుమెంట్లు ఎన్నో ప్రశంసలు పొందాయి.