ఇవి తెలుసుకోకుండా యోగా అస్సలు మొదలుపెట్టకండి..!
posted on Aug 23, 2025 @ 11:55AM
యోగా అనేది శరీర కదలిక, శ్వాసల సమతుల్య కలయిక. మంచి నిద్ర, మెరుగైన గుండె ఆరోగ్యం, ఆందోళన తగ్గించుకోవడం వంటి ఫలితాల కోసం యోగ ను రికమెండ్ చేస్తుంటారు. యోగా సాధన జీవితాలను మెరుగుపరుస్తుంది. యోగా గురించి తెలుసుకున్నవారు దాన్ని మొదలు పెట్టాలని అనుకుంటారు. యోగా సాధన చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, సరైన ప్రక్రియను తెలుసుకోకపోతే చాలా నష్టపోవాల్సి వస్తుంది.
యోగా ప్రారంభానికి ముందు గుర్తుంచుకోవలసిన 10 విషయాలు..
వ్యాయామం, యోగా.. ఏది బెస్ట్..
యోగా ఒక జీవన విధానం. ఇందులో శరీర కదలికలు, ఏకాగ్రతతో శ్వాస మీద ధ్యాస పెట్టడం, ప్రాణాయామం మొదలైనవి ఉన్నాయి. యోగా లో సమయం, శరీర కదలిక, శ్వాస ఈ మూడు చాలా ముఖ్యం. ఇవి అద్బుతం చేస్తాయి. వ్యాయామానికి ఇంత ప్రబావం లేదు.
ప్రారంభం, నిలకడ..
చాలామంది చేసే సాధారణమైన తప్పులలో ఒకటి, మొదటి రోజు అతిగా యోగా చేయడం. కానీ యోగాను పది లేదా పదిహేను నిమిషాలతో ప్రారంభించాలి. తరువాత క్రమంగా పెంచి మార్గంలోకి తీసుకెళ్లాలి.
శరీరాన్ని అర్థం చేసుకోవాలి..
యోగా చేసేటప్పుడు తొడ కండరాలు, మణికట్టు ఒత్తిడిగా అనిపించడం, శరీరంలో ఇతర భాగాలలో కూడా ఇబ్బంది అనిపించడం వంటివి అనిపించినా సరే.. పంతంతో యోగా చేయడం తప్పు. యోగా చేయడానికి శరీరానికి తగిన భంగిమ ఏది? ఎలా చేస్తే ప్రబావం ఉండదు.. ఇవన్నీ తెలుసుకోవాలి. వీలైతే మొదట్లో యోగా మాస్టర్స్ దగ్గర మెళకువలు నేర్చుకుని తర్వాత సొంతంగా చేసుకోవచ్చు.
వార్మప్ లను మిస్ చేయొద్దు..
వ్యాయామం లాగే యోగాకు వార్మప్ ముఖ్యం. మార్జాలాసనం, భుజంగాసనం వంటివి శరీరాన్ని మెల్లిగా సాగదీస్తూ శరీరాన్ని సన్నద్ధం చేస్తాయియ. ఇవి శరీర కండరాలను రిపేర్ కూడా చేస్తాయి.
కోచ్..
మంచి యోగా మాస్టర్ యోగాలో తప్పులను స్పష్టంగా చెప్పగలడు. వీపు స్ట్రైయిట్ గా ఉందా లేదా మోకాళ్ళు తప్పుగా బెండ్ చేసి ఉన్నాయా.. వారు గమనిస్తారు. వీపు నొప్పి ఉన్నవారు ఎలా చేయాలి? ఆర్థరైటిస్ ఉన్నవారు ఎలా చేయాలి? ఇలాంటివన్నీ కోచ్ లు బాగా చెప్పగలరు.
శ్వాస కీలకం..
యోగాలో శ్వాసే కీలకం. స్థిరమైన శ్వాస, శ్వాస భంగిమ కంటే వేగంగా మనస్సును శాంతపరుస్తుంది. ప్రాణాయామం అంటే బయటి శబ్దాల స్విచ్ ను ఆఫ్ చేసి మెదడును ప్రశాంత వలయంలోకి తీసుకెళ్ళడం.
ఆహారం..
చాలామందిని గమనిస్తే పూర్తీగా మోకాళ్ల మీద వంగి కింది నేలను చేతి వేళ్లతో తాకాలంటే చాలా ఇబ్బంది పడతారు. ఇది పొట్ట వల్ల వచ్చే ఇబ్బంది. ఆహారం దగ్గర జాగ్రత్త తీసుకుంటే ఈ పొట్టను యోగా ద్వారా కరిగించవచ్చు.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...