ప్రైవేటు బిల్లుకు మద్దతిస్తేనే జీఎస్టీ బిల్లుకు మద్దతు..
posted on Jul 22, 2016 @ 1:08PM
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కేవీపీ రాజ్యసభలో పెట్టిన ప్రైవేటు బిల్లుపై నేడు ఓటింగ్ జరగనుంది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా తమ బిల్లును గెలిపించుకోవడానికి శత విధాలా ప్రయత్నిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నేతలు ఎలాగు ఓట్లు వేస్తారు.. ఇక టీడీపీ, వైసీపీ నేతలు కూడా ఓట్లు వేయాల్సిందే. ఇంక పలు పార్టీలు కూడా బిల్లుకు మద్దతు పలికాయి. అయితే ఇప్పుడు ఈ బిల్లును గెలిపించుకోవాడానికి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి అవసరమని టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ కొన్ని సూచనలు చేశారు. కేవీపీ ప్రైవేటు బిల్లుకు మద్దతు ఇస్తేనే జీఎస్టీ బిల్లుకు మద్దతిస్తామని బీజేపీకి కాంగ్రెస్ తేల్చిచెప్పాలని అన్నారు. బీజేపీకి మిత్రపక్షంగా ఉంటూనే రాష్ట్రానికి రావాల్సినవి సాధించుకుంటామని.. తాము ఏపీ ప్రజల ప్రయోజనాలను కాపాడుకునే క్రమంలో వెనకడుగు వేయబోమని తేల్చి చెప్పారు.