ఎపీ భవన్ వద్ద ఉద్రిక్తత, తోపులాట
posted on Feb 5, 2014 @ 11:58AM
ఎపీ భవన్ లో సీమాంధ్ర, తెలంగాణ నేతల మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ కు వ్యతిరేకంగా దీక్ష చేయనున్న నేపథ్యంలో ఆయన కాన్వాయ్ లోకి దూసుకెళ్లేందుకు తెలంగాణావాదులు ప్రయత్నించారు. సీమాంధ్ర ప్రాంత నేతలు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు ప్రాంతాల నేతల మధ్య తోపులాట జరిగి పలువురు నేతలు కింద పడిపోవడంతో పరిస్థితి ఉద్రిక్తత౦గా మారింది. అంతలోనే పోలీసులు ఇరుప్రాంతాల నేతలను అదుపు చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. సీఎం కు వ్యతిరేకంగా తెలంగాణ వాదులు నినాదాలు చేయగా...సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్ర నేతలు నినాదాలు చేశారు. ఎపీ భవన్ లో ఇరుప్రాంత నేతల నినాదాలతో తీవ్ర గందరగోళం నెలకొంది.