చంద్రగ్రహణం.. తెలుగు రాష్ట్రాలలో ఆలయాల మూసివేత
posted on Sep 6, 2025 @ 3:19PM
చంద్రగ్రహణం కారణంగాఆదివారం (సెప్టెంబర్ 7) తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం మూడపడనుంది. ఆ రోజు సాయంత్రం మూడున్నర గంటల నుంచి మరుసటి రోజు అంటే (సెప్టెంబర్ 8) తెల్లవారు జామున 3 గంటల వరకూ దాదాపు 12 గంటల పాటు శ్రీవారి ఆలయాన్ని మూసివేయ నున్నారు. అంతే కాకుండా ఆదివారం (సెప్టెంబర్ 7)న ఆర్జిత సేవలన్నీ రద్దు చేసినట్లు టీడీడీ ప్రకటించింది. అలాగే ఆ రోజు సాయంత్రం 3 గంటల నుంచి మరుసటి రోజు అంటే సోమవారం (సెప్టెంబర్ 8) ఉదయం ఎనిమిదిన్నర గంటల వరకూ అన్నప్రసాద వితరణ కేంద్రాలను కూడా మూసివేస్తున్నట్లు టీడీడీ ప్రకటించింది.
అదే విధంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ గుడిని కూడా చంద్రగ్రహణం కారణంగా ఆదివారం మధ్యాహ్నం మూడున్నర గంటల నుంచి సోమవారం తెల్లవారు జాము వరకూ మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ రెండు ఆలయాలే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాలోని అన్ని దేవాలయాలనూ కూడా చంద్రగ్రహణం కారణంగా ఆదివారం మధ్యాన్నం నుంచి సోమవారం ఉదయం వరకూ మూతపడనున్నాయి.