హైద్రాబాద్ లో పెరుగుతున్న ఊష్ణోగ్రతలు
posted on May 20, 2023 @ 12:21PM
హైదరాబాద్ ఊష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. పాదరస ముల్లు పై పైకి ఎగబాకుతుంది. శుక్రవారం రోజు 42.6 డిగ్రీల సెల్సియస్ పెరిగినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ లో ఖైరతాబాద్ అత్యంత ఊష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ(టిఎస్డి పిఎస్) తెలియజేసిన వివరాల ప్రకారం ఖైరతాబాద్ తో పాటు ఇతర ఎనిమిది ప్రాంతాల్లో ఊష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. 40 డిగ్రీలకంటే ఎక్కువగా సెల్సియస్ నమోదవుతున్నాయి.
ఖైరతాబాద్ (42.5) డిగ్రీల సెల్సియస్),
చార్మినార్(41.1 డిగ్రీల సెల్సియస్),
నాంపల్లి (40.7 డిగ్రీల సెల్సియస్),
బండ్ల గూడ (40.3 డిగ్రీల సెల్సియస్)
హిమాయత్ నగర్ (40.3 డిగ్రీల సెల్సియస్),
ముషీరాబాద్(40.3 డిగ్రీల సెల్సియస్),
షేక్ పేట(40.2 డిగ్రీల సెల్సియస్)గా నమోదైంది. ఉష్ణోగ్రతలు ఒక్క హైదరాబాద్ లోనే కాదు తెలంగాణా జిల్లాల్లో ఊష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటున్నాయి.
శుక్రవారం నల్గొండ జిల్లా దామరచర్ల , కరీంనగర్ వీర్నవంక 45.4 డిగ్రీల సెల్సియస్ ఊష్ణోగ్రతలు నమోదయ్యాయి.
హైదరాబాద్ లో ఎండలు మరింత ముదరనున్నాయని వాతావారణ శాఖ హెచ్చరిస్తోంది. మే 22 వరకు ఇదే పరిస్థితి. 38 నుంచి 41 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని అంచనా. మిగతా జిల్లాల్లో 45 డిగ్రీల సెల్సియస్ వరకు పెరగవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది.