తెలంగాణ వచ్చి తీరుతుంది
posted on Feb 21, 2013 @ 4:59PM
ప్రత్యేక తెలంగాణ సాధనపై తాము వెనక్కు తగ్గలేదని, తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె. జానారెడ్డి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇస్తుందన్న నమ్మకం ఉందని, సంయమనం పాటిస్తున్నామని ఆయన అన్నారు. తెలంగాణ వచ్చి తీరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణ సాధన కోసం టీ. జెఎసి తలపెట్టిన సడక్ బంద్ ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనమని ఆయన అన్నారు. సడక్ బంద్ ద్వారా తెలంగాణ జెఎసి ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకుంటోందని జానా రెడ్డి అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించి తీరుతామని జానారెడ్డి చెప్పారు. అయితే, ఎన్నికలు ఎప్పుడనేది ఇప్పుడే చెప్పలేమని అన్నారు. పాతపద్ధతిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని, ఈ విషయంలో అపోహలు వద్దని ఆయన అన్నారు. జానారెడ్డిముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పంచాయతీరాజ్ ఎన్నికలపై చర్చించినట్లు సమాచారం.