టీ సర్కార్ పై హైకోర్టు ఫైర్.. రెండు రోజులు ఆగలేకపోయారా..?
posted on Jul 25, 2016 @ 6:03PM
తెలంగాణలోని ఆరు యూనివర్సిటీలకు ప్రభుత్వం వీసీలను నియమించింది. అయితే దీనిపై స్పందించిన హైకోర్టు ప్రభుత్వ తీరుపై మండిపడింది. తెలంగాణలో పలు యూనివర్శిటీ వీసీల నియామకంపై ఎప్పటి నుండో హైకోర్టులో విచారణ జరుగుతుంది. అది ఓ కొలిక్కి రాకముందే టీ సర్కార్ వీసీలను నియమించింది. దీంతో ఉపకులపతుల నియామకం జరపకుండా రేండేళ్లు ఆగిన ప్రభుత్వం మరో రెండు మూడు రోజులు ఆగలేకపోయిందా? అని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. వీసీలను నియమించినంత మాత్రాన ఆ తరువాత ఏం చేయాలో తమకి తెలయదని అనుకోవద్దని హైకోర్టు వ్యాఖ్యానించింది.
కాగా టీ సర్కార్ నియమించి వీసీలు వీరే..
1. జేఎన్టీయూకు ప్రొఫెసర్ వేణుగోపాల్ రెడ్డి
2. ఉస్మానియా వర్సిటీ వీసీగా రామచంద్రం
3. వరంగల్ కాకతీయ వర్సిటీ వీసీగా సాయన్న
4. తెలుగు యూనివర్సిటీ వీసీగా ఎస్వీ సత్యనారాయణ
5. తెలంగాణ యూనివర్సిటీ వీసీగా సాంబయ్య
6. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా సీతారామారావు