తెలంగాణ ఆర్టీసీ విద్యుత్ ఛార్జీల పెంపు..
posted on Jun 22, 2016 @ 4:56PM
తెలంగాణ ఆర్టీసీ ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉన్నసంగతి తెలిసిందే. ఒకానొక సందర్భంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీని ముసేస్తారు అన్న కథనాలు కూడా వినిపించాయి. ఈనేపథ్యంలోనే ఇప్పుడు తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్క ఆర్టీసీ ఛార్జీలు మాత్రమే కాదు విద్యుత్ ఛార్జీలు కూడా పెంచుతున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఛార్జీల పెంపు సామాన్యుడికి భారంగా ఉండకూడదని అధికారులకు సూచించారట. పల్లెవెలుగు బస్సుల్లో 30 కిలోమీటర్ల లోపు రూపాయి, 30 కిలోమీటర్లు దాటితే రూ.2 పెంచాలని ఆర్టీసీ అధికారులు సూచించగా దానిని ఆమోదించిన కేసీఆర్ ఇతర బస్సు సర్వీసుల్లో ఛార్జీల పెంపు 10శాతానికి మించరాదని చెప్పారు.
ఇంకా విద్యుత్ ఛార్జీలు పెంపుదలపై కూడా కేసీఆర్ కొన్ని సూచనలు చేసినట్టు తెలుస్తోంది. 100 యూనిట్లలోపు విద్యుత్ ఛార్జీలు పెంచొద్దని, 100 యూనిట్లు దాటితే స్వల్పంగా పెంచాలని పరిశ్రమలు వినియోగించే విద్యుత్‌పై 7శాతం లోపే పెంపు ఉండాలన్నారు.