కోదండరాంపై టీఆర్ఎస్ మూకుమ్మడి దాడి..
posted on Jun 6, 2016 @ 6:29PM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనపై ఉద్యమానికి రెడీ అయిన టీజేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంను టీఆర్ఎస్ టార్గెట్ చేసింది. ఈ నేపథ్యంలో కోదండరాంపై టీఆర్ఎస్ నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
ప్రపంచమంతా కేసీఆర్‌ను కీర్తిస్తుంటే కోదండరాం మాత్రం తప్పుబడుతున్నారు. కోదండరాం కుబుసం వీడిచిన పాము, కాంగ్రెస్ ఏజెంట్.
-బాల్కసుమన్, ఎంపీ
తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఉనికిలోనే లేదు, మరి కోదండరాం దేనికి ఛైర్మన్. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి. జేఏసీ ముసుగులో ప్రభుత్వంపై దాడి చేయాలనుకుంటున్నారు
- జగదీశ్ రెడ్డి ( తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి)
మిషన్ కాకతీయ బాగుందని గతంలో చెప్పిన కోదండరాం..ఇప్పుడు బాగా లేదనడంలో అర్థమేంటి.? కోదండరాం విమర్శల వెనుక కుట్రలు, కుతంత్రాలు దాగి ఉన్నాయి
-ఈటెల రాజేందర్ ( ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి)