తెలంగాణ కొత్త జిల్లాలు ఇవే..
posted on Oct 12, 2016 @ 10:37AM
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం 31 జిల్లాలతో సరికొత్త స్వరూపాన్ని సంతరించుకుంది. ఈ జిల్లాల తుది నోటిఫికేషన్ విడుదుల చేశారు. ఈ సందర్బంగా కేసీఆర్ మాట్లాడుతూ..ఏదో తమాషా కోసం జిల్లాలను ఏర్పాటు చేయలేదని.. చిట్ట చివరి రూపాయి కూడా లబ్ధిదారునికి అందాలన్న ఉద్దేశంతోనే కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతీ జిల్లాలో 2 లక్షల నుంచి మొదలుకొని 4 లక్షల వరకు మాత్రమే జనాభా ఉండాలన్నారు. ఈ విధంగా ఉండటం వల్ల ఆ జిల్లాల్లోని కుటుంబాల పరిస్థితులన్నీ సంబంధిత జిల్లా కలెక్టర్‌కు తెలిసే అవకాశం ఉంటుందన్నారు. ప్రతీ ఒక్కరూ ఆర్థికంగా పైకి రావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని.. రాబోయే రోజుల్లో బంగారు తెలంగాణను చూడబోతున్నామని అన్నారు. తెలంగాణ కొత్త జిల్లాలు ఇవే..
1. ఆదిలాబాద్
2. మంచిర్యాల
3. నిర్మల్
4. కొమరంభీం
5. కరీంనగర్
6. జగిత్యాల
7. పెద్దపెల్లి
8. రాజన్న
9. నిజామాబాద్
10. కామారెడ్డి జిల్లా
11. వరంగల్ అర్బన్
12. వరంగల్ రూరల్
13. జయశంకర్
14. జనగాం
15. మహబూబాబాద్
16. ఖమ్మం
17. భద్రాద్రి
18. మెదక్
19. సంగారెడ్డి
20. సిద్ధిపేట
21. మహబూబ్‌నగర్
22. వనపర్తి
23. నాగర్‌కర్నూల్
24. జోగులాంబ
25. నల్లగొండ
26. సూర్యపేట
27. యాదాద్రి
28. వికారాబాద్
29. మల్కాజ్‌గిరి(మేడ్చెల్)
30. రంగారెడ్డి
31. హైదరాబాద్