సాగునీటపై తెలంగాణ మంత్రులపై పెరుగుతున్న వత్తిడి
posted on Jul 2, 2012 @ 4:22PM
సాగర్‌నీరు డెడ్‌స్టోరేజ్‌లో ఉన్నా కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేస్తుండడం పట్ల తెలంగాణా వాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. సీమాంద్ర నేతలు వారి ప్రజల ప్రయోజనం కోసం తాపత్రయ పడుతుంటే తెలంగాణా మంత్రులు ఏమీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని తెలంగాణా ప్రజా సంఘాలు విమర్శిస్తున్నాయి. మంత్రుల వైఖరి మారకపోతే వారి ఇళ్ళవద్ద ధర్ణా చేస్తామని హెచ్చరిస్తున్నారు. నల్గొండ జిల్లా గొంతుఎండుతున్న జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్ నోరు ఎత్తక పోవడం శోచనీయం అని జాక్ నేతలు అన్నారు. తెలంగాణాకు సాగర్ నీరు విడుదల చేయకపోయినా తమ ప్రాంత నాయకులు అభ్యంతరం తెలపకపోవడం గర్హనీయమని ఓయు జెఎసి చైర్మన్ ప్రవీణ్‌రెడ్డి,టీఎస్‌జెఎసి అధికార ప్రతినిధి తుంగబాలు ప్రకటించారు. అనంతరం యూనివర్సిటీ ఆధ్వర్యంలో వారు మంత్రి దిష్టి బొమ్మలు తగులబెట్టారు.కృష్ణా డెల్టాకు నీరు ఆపకుంటే మంత్రుల ఇళ్లను, డ్యామ్‌ను ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పై తిరుగుబాటు ప్రకటించాలని తెలంగాణ ఓట్లతో గెలిచిన మంత్రి సుదర్మన్ రెడ్డి ఇక్కడి ప్రజలకు దేవుడే దిక్కు అని వ్యాఖ్యానించటం సిగ్గుచేటని వారు అన్నారు.
ఇదిఇలా ఉంగా కృష్ణాడెల్టాలో నారుమళ్లు పూర్తిగా ఎండిపోతున్నాయని రైతులు గగ్గోలు పెడుతున్నందువల్లే నాగార్జున సాగర్ నీటిని విడుదల చేయడం జరిగిందని, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పార్ధసారధి వివరణ ఇచ్చారు.. తెలంగాణ ప్రజలు దీనిని అర్ధం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ విషయమై అనవసర రాద్దాంతం చేసి సమస్యను మరింత జఠిలం చేయవద్దని ఆయన కోరారు.