మెడికల్ సీట్ల కెటాయింపులో తెలంగాణ నాయకులు ఆరోపణ
posted on Jul 2, 2012 @ 4:19PM
మెడికల్ సీట్ల విషయంలోనూ తెలంగాణకు అన్యాయం జరిగిందని తెలంగాణా వాదులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో ఏ మెడికల్ కాలేజీల్లోనూ మౌలిక సదుపాయాలు సరిగా లేవని ప్రభుత్వానికి తెలిపిన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సీమాంధ్ర వారికి మాత్రమే 150 సీట్లు ఎందుకిచ్చిందని వారు ప్రశ్నిస్తున్నారు. ఆంద్రయూనివర్సీటీలో మౌలిక సదుపాయాలు లేవని,దానికి హెల్త్ యూనివర్సిటీ సెక్రటరీ బాధ్యత స్వీకరిస్తేనే సీట్ల పెంపకానికి అంగీకరిస్తామని ఎంసిఐ గతంలో పేర్కొంది. దానికి అంగీకరించి హెల్త్ యూనవర్సిటీ లెటర్ పంపిన తర్యాత సీట్ల జరిగింది దీన్నికూడా తెలంగాణా వాదులు తప్పుపడుతున్నారు. విజయవాడ మెడికల్ కాలేజీలో రేడియాలజీ, రూరల్‌హెల్త్ భవనాలు లేనప్పటికీ సీట్లు మంజూరు చేయటంపట్ల వారు అభ్యంతరం తెలిపారు. గాంధీకాలేజీలో ఒపి తక్కువగా వుందని, వరంగల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ కాలేజీ రిపోర్టును తగిన సమయంలో డిఎంఇ కి ఇవ్వకపోవడం వల్ల ఆయా కాలేజీల తనిఖీకి ఎం.సి.ఐ. అధికారులు వెళ్ళలేదు. కాలేజీ సిబ్బంది నిర్లక్ష్యం మూలంగానే ఇది జరిగిందని తెలంగాణా వాదులు అంటున్నారు. నిజాం కాలేజీకి సిబ్బందిని నియమించి, భవనాలు త్వరగా పూర్తిచేయగలిగితే కాలేజీ ప్రారంభమయ్యేదన్నారు. నిజాం మెడికల్ కాలేజి 2010 సంవత్సరంలో భవన నిర్మాణం పారంభం చేసినా ఇంకా పూర్తిచేయకపోవడంతో ఇప్పటికీ సీట్లు తెచ్చుకోలేక పోయిందని తెలిపారు. ఉస్మానియాలో చిన్న చిన్న సమస్యలు ఉన్నా సీట్లు పెంచలేదని అదే సీమాంద్రలో మాత్రం భవనాలు లేకపోయినా సీట్ల కెటాయింపు జరిగిందని వారు విమర్శించారు.