తెలంగాణలో సమైఖ్యగానం
posted on Jul 26, 2013 @ 11:19AM
దేశ రాజకీయాల్లో తెలంగాణ చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు అసలు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వాదం కు ఉన్న బలం ఎంత అన్న వాదన మొదలైంది.. ఇన్నాళ్లు తెలంగాణలోని ప్రతి వ్యక్తి ప్ర్యతేక రాష్ట్రం కోరుకుంటున్నాడంటూ చెపుతూ వచ్చిన కొంత మందికి ప్రస్థుత పరిస్థితులు మింగుడు పడటం లేదు..
ప్రస్థుత రాష్ట్ర రాజదానిగా ఉంటూ ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ రాజధానిగా కూడా ఉండే హైదరాబాద్‌లోనే తెలంగాణ వాదం అంత బలంగా లేదంటున్నారు.. ఇక్కడ బలమైన ఓటు బ్యాంక్ ఉన్న మజ్లీస్ పార్టీతో పాటు.. కొంత మంది అధికార కాంగ్రెస్ నాయకులకు కూడా సమైఖ్య రాష్ట్రనికే సై అంటున్నారు..
ముఖ్యంగా భాగ్యనగర్ బ్రదర్స్‌గా పేరు పడిన దానం నాగేందర్, ముఖేష్ గౌడ్‌లు మొదటి నుంచి తెలంగాణ వాదం పై భిన్న వాదనలు వినిపిస్తున్నారు.. ఇప్పుడు వీరి వాదానికి మరింత బలం చేకూరుస్తూ ఎమ్మేల్యే జగ్గారెడ్డి కూడా సమైక్యరాగం అందుకున్నారు..
తెలంగాణ ప్రాంతంలోని ప్రజలందరూ ప్ర్యతేక రాష్ట్రం కోరుకుంటున్నారనడం అవాస్తవమని ఇక్కడి ప్రజల్లో కూడా చాలా మంది కలిసుండాలని కోరుకుంటున్నారన్నరు..