నాగం జనార్ధన్ రెడ్డి కి ఎర్త్ పెడుతున్న కేసిఆర్
posted on Feb 8, 2013 @ 4:11PM
నాగర్ కర్నూల్ స్వతంత్ర ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, టీజేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్‌లపై మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్న తనను తెలంగాణా జేఎసిలోకి చేరనీయకుండా కేసీఆర్ అడ్డుపడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్, కోదండరామ్‌లు ఉద్యమం గురించి కాకుండా ఎన్నికల గురించే ఆలోచిస్తున్నారని అన్నారు. అసలు తెలంగాణా ఉద్యమాల గురించి, తెలంగాణలో జరుగుతున్నబలిదానాల గురించి ఆలోచించకుండా, వారిరువురూ ఎన్నికల గురింఛి ఎందుకు ఆలోచిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
అసలు నాగమన్నతనని తెలంగాణా జేఎసిలోకి జేరనివ్వనందుకు బాధపడుతున్నారా లేక వారిరువురూ ఉద్యమం పక్కదారి పట్టిస్తునందుకు బాధపడుతున్నారో తెలియదు గానీ, (ఆ అక్కసుతో) ఆయన చేసిన ఆరోపణలతో తెలంగాణా జేఎసి చేస్తున్న ఆలోచనలను మాత్రం బయటపెట్టారు.