తెలంగాణ వచ్చే అవకాశమే లేదా
posted on Jul 5, 2012 @ 1:32PM
తెలంగాణా కోసం 12 ఏళ్ళ పోరాటాన్కి కాంగ్రెస్ మద్దతు లభించలేదని తెలుస్తున్నది. తెలంగాణ రాష్ట్రంఏర్పాటుకు కేంద్రంలోని మిత్ర పక్షాలు మద్దతు తెలుపకపోవడంతో పార్లమెంట్‌లో బిల్లు పెట్టేందుకు కాంగ్రెస్ వెనుకడుగు వేస్తున్నది. యుపిఎ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న సమాజ్‌వాది పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, ఎన్‌సిపి వెనుకంజ వేస్తున్న విషయం తెలిసిందే. ఈ పార్టీలు చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకంగా వాదనలు వినిపిస్తున్నారు.
ఈ పార్టీల నుంచి ఆమోదం రాని పక్షంలో పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టే ప్రసక్తే లేదు. దీనిని దాటవేసేందుకు కాంగ్రెస్ నానావిధాల తంటాలు పడుతోంది. తెలంగాణ కోసం బిల్లు పెడితే కేంద్రప్రభుత్వం కూలడం ఖాయం. ఈ భయంతోనే కాంగ్రెస్ బిల్లు పెట్టే ప్రసక్తే లేదని తెలుస్తోంది. ప్రతిపక్ష సవాళ్ళపై, ఆమోదాలపై అధికార పార్టీ బిల్లు పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టడం జరుగదు. ఈ కారణంగా 2014 వరకూ కాంగ్రెస్ కాలం గడిపేస్తుందనడంలో సందేహం లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి తరచూ ఈ ఏడాది తెలంగాణ వస్తోంది. వచ్చే ఏడాది ఈ పండుగను తెలంగాణలో జరుపుకుందాం అంటూ ప్రకనటులు వాస్తవ దూరంగానే కనిపిస్తున్నాయి.
అంతే కాదు ఇప్పట్లో తెలంగాణ విషయంలో 2009 తరువాత కేంద్రంలో ప్రతిస్పందనే లేదు. ఇకపై ఉప ఎన్నికలకు పోయే ధైర్యం చేసే యోచన గానీ, ధైర్యంగానీ టిఆర్‌ఎస్‌కు లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పరకాల ఉప ఎన్నికతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ధీటుగా టిఆర్‌ఎస్ లేదని స్పష్టమవుతున్నది. తెలంగాణ రావడం ఆలస్యమయితే టిఆర్‌ఎస్‌కు ప్రజల మద్దతు లభించడం కష్టమవుతుంది. వాదంపై చీలికలతో తెలంగాణ రావడం దూరమవుతుందని తెలంగాణ పోరాట పార్టీలు స్పష్టం చేసే అవకాశం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్‌డిఎ అధికారంలోకి వస్తే 2014లో చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా నిర్ణయం జరిగే అవకాశం ఉన్నది.