తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల
posted on Jun 18, 2020 @ 3:22PM
తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం విడుదల చేశారు. మొత్తం 9,65,839 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఈ పరీక్షల ఫలితాల్లో బాలికల హవా కొనసాగింది.
ఫస్టియర్ లో 4,80,516 మంది విద్యార్థులు హాజరు కాగా, 60.01 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 75 శాతం ఉత్తీర్ణతతో మేడ్చల్ జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా, 71 శాతం ఉత్తీర్ణతతో రంగారెడ్డి, కుమ్రంభీం జిల్లాలు రెండో స్థానంలో నిలిచాయి. ఫస్టియర్ లో బాలికల ఉత్తీర్ణత శాతం 67.4 కాగా, బాలుర ఉత్తీర్ణత శాతం 52.30 గా నమోదైంది.
సెకండియర్ లో 4,85,323 మంది విద్యార్థులు హాజరు కాగా, 68.86 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 76 శాతం ఉత్తీర్ణతతో కుమ్రంభీం ప్రథమ స్థానంలో నిలబడింది. 75 శాతం ఉత్తీర్ణతతో మేడ్చల్ జిల్లా రెండో స్థానం దక్కించుకుంది. సెకండియర్ లో బాలికల ఉత్తీర్ణత శాతం 75 కాగా, బాలుర ఉత్తీర్ణత శాతం 62 గా నమోదైంది.