మాజీ సీఎం జగన్‌కు బిగ్ షాక్
posted on Aug 26, 2025 @ 1:05PM
ఏపీ మాజీ సీఎం జగన్‌కు తెలంగాణ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. వాన్ పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థపై ఉన్న కేసు క్వాష్ చేయాలని పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల్లో వాన్‌పిక్ పేరును సీబీఐ తన ఛార్జ్‌షీట్‌లో చేర్చింది. 2022 జులైలో వాన్‌పిక్ ప్రాజెక్ట్ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది.
అయితే ఈ కేసులో సీబీఐ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. వాన్‌పిక్ వేసిన క్వాష్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. వాన్‌పిక్ ఓడరేవుకు భూకేటాయింపుల్లో అక్రమాలు, క్విడ్ ప్రోకో జరిగిందంటూ అభియోగాలు మోపారు సీబీఐ అధికారులు. వాన్ పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో భూసేకరణ జరిగిందని సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు.