ఈ పాపం రైల్వేదే: తెలంగాణ ప్రభుత్వం
posted on Jul 25, 2014 9:17AM
మాసాయిపేట రైల్వేక్రాసింగ్ దుర్ఘటనలో చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోవడానికి రైల్వే శాఖదే పూర్తి బాధ్యత అని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. రైల్వే అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇంత ఘోరం జరిగిందని తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రమాద సంఘటనపై రైల్వే శాఖ మంత్రి మాట్లాడిన తీరు సరైన విధానం కాదన్నారు. సౌత్‌సెంట్రల్ రైల్వేజోన్ జీఎం శ్రీవాస్తవ్‌ను మూడు రోజుల క్రితం గ్రామస్థులు కలిసి గేట్ ఏర్పాటు చేయాలని కోరినప్పటికీ ఆయన ఎంతమాత్రం స్పందించలేదని చెప్పారు. రైల్వే అధికారుల నిర్లక్ష్యం ఇంత మంది చిన్నారుల ప్రాణాలను బలిగొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలోని ప్రతి రైల్వేక్రాసింగ్ వద్ద గేట్లు ఏర్పాటు చేయడానికి తమ ప్రభుత్వం సైతం ఖర్చు భరిస్తుందని హరీష్ రావు ప్రకటించారు. జరిగిన ప్రమాదంలో మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు ముఖ్యమంత్రి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని చెప్పారు.