7వేల 992 కోట్ల రూపాయల డబ్బు ఏమైంది? టిపిసిసి
posted on May 11, 2020 @ 12:41PM
కరోనా ముసుగులో కేసీఆర్ ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోందని తెలంగాణా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. కోట్ల రూపాయలు దోచుకుతింటున్నారంటూ టిపిసిసి అధికార ప్రతినిధి ఇందిరాశోభన్ తెలంగాణా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. కరోనా నిధుల గుల్‌మాల్ పై గుట్టువిప్పుతానంటున్నారు.
కేంద్ర ప్రభుత్వం కరోనా నిర్మూలనకు తెలంగాణ రాష్ట్రానికి రూ. 6082 కోట్లు ఇచ్చింది. పైగా విరాళాల రూపంలో మరో 500 కోట్ల రూపాయలు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల జీతాల కోత పెట్టి 4000 కోట్ల రూపాయలు మిగుల్చుకుంది. మొత్తం 10వేల 582 కోట్ల రూపాయలు.
ఒక్క కరోనా రోగికి కోలుకోవడానికి అయ్యే ఖర్చు రూ. 3.5 లక్షలు. అయితే తెలంగాణాలో వున్న మొత్తం 1100 రోగులకు అయ్యే ఖర్చు 39 కోట్ల రూపాయలు.
ఇప్పటి వరకు జరిగిన మొత్తం కరోనా అనుమానితుల పరీక్షలు 20000 మందికి. ఒక్కొక్కరికి రూ. 4500 ఖర్చు. మొత్తం కరొనా పరీక్షలకు ఖర్చు రూ. 9 కోట్లు.
క్వారంటైన్ లో ఉన్న ఒక్కరికి ఒక రోజు ఖర్చు 500 రూపాయలు. మొత్తం 30000 మందికి 28 రోజుల క్వారంటైన్ ఖర్చు 42 కోట్ల రూపాయలు.
ఆస్పత్రుల ఏర్పాటుకు 100 కోట్ల రూపాయలు. రాష్ట్రం పేదలకు ఇస్తున్న ఒక్కొక్కరికి రూ.1500 లు చొప్పున రూ. 1200 కోట్లు.
12 కిలోల బియ్యం విలువ : రూ.1000 కోట్లు. (రాష్ట్రం ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా ఇస్తున్న 12 కిలోల బియ్యం లో.. కేంద్రం ఇస్తున్న 5 కిలోల బియ్యం కూడా ఉన్నవి. ఆ ఐదు కిలోల లెక్క తగ్గిస్తే వెయ్యి కోట్లు కాదు ఇంకా తగ్గుతుంది.) ఉద్యోగుల బోనస్: రూ. 100 కోట్లు.
ఇతరములు : రూ. 100 కోట్లు. ఇలా మొత్తం ఖర్చు సుమారుగా 2 వేల 590 కోట్లు మాత్రమే. అయితే మిగిలిన 7 వేల 992 కోట్ల రూపాయల డబ్బు ఏక్కడికి పోయిందని తెలంగాణా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది.