తెలంగాణ సీఎం రేవంత్.. తేల్చేసిన కాంగ్రెస్ హైకమాండ్
posted on Dec 4, 2023 @ 11:12PM
తెలంగాణ సీఎంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేరుని ఏఐసీసీ ఖరారు చేసింది. ఈనెల 7వ తేదీన ఉదయం 10 గంటలకు రేవంత్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.పార్లమెంటరీ స్ట్రాటజీ కమిటీ సమావేశం తరువాత కాంగ్రెస్ హై కమాండ్ తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును ప్రకటించింది.
ముందుగా ఈ రోజు సాయంత్రమే ప్రమాణ స్వీకారం ఉంటుందని భావించినా, హైకమాండ్ నిర్ణయం వెలువడటంతో జాప్యం జరగడంతో ప్రమాణ స్వీకారం కార్యక్రమం గురువారం (డిసెంబర్ 7)కు వాయిదా పడింది. ఆ రోజు రేవంత్ రెడ్డితో పాటు కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు.
సీఎల్ పీ నేతగా రేవంత్ రెడ్డిని హైకమాండ్ ఖరారు చేయడంతో ఇక ఆయన కేబినెట్ లో ఎవరెవరు ఉంటారన్నది ఆ తేదీ లోగా నిర్ణయిస్తారుప. మంగళ, బుధవారాలు (డిసెంబర్ 5, 6) మంచి రోజులు కాకపోవడంతో రేవంత్ ప్రమాణస్వీకార కార్యక్రమం గురువారం (డిసెంబర్ 7) న జరుగుతుంది. అదే రోజున రేవంత్ కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు.