సచివాలయానికి 'టి' బిలొచ్చింది
posted on Dec 12, 2013 @ 6:41PM
తెలంగాణ ముసాయిదా బిల్లు సచివాలయాని చేరింది. దేశ రాజధాని నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన హోంశాఖ అధికారి సురేష్ కుమార్ భారీ భద్రత నడుమ 120 పేజీలు గల ముసాయిదా బిల్లు, 30 పేజీల ముసాయిదా బ్రీఫ్ ను సచివాలయంలో ప్రధాని కార్యదర్శి మహంతికి అందించారు. ఈ రాత్రి కల్లా సీఎంకు తెలంగాణ ముసాయిదా బిల్లును ప్రభుత్వ ప్రధాని కార్యదర్శి మహంతి అందించనున్నారు. సీఎం నుంచి గవర్నర్ వద్దకు కూడా ఈ రోజు రాత్రే బిల్లు వెళ్లనున్నట్లు సమాచారం.
తెలంగాణ ముసాయిదా బిల్లు పైన సభ అభిప్రాయమే కాక సభ్యుల అభిప్రాయాన్ని కూడా రాష్ట్రపతి కోరారు. దీని కోసం అసెంబ్లీకి రాష్ట్రపతి ఆరువారాల సమయం ఇచ్చారు. వచ్చే ఏడాది జనవరి 23లోగా అభిప్రాయం చెప్పవలసి ఉంటుంది.
మరోవైపు రాష్ట్రపతి ఆరువారాల సమయం ఇచ్చిన కూడా కేంద్ర౦ ఇదే సమావేశాల్లో తెలంగాణ ముసాయిదా బిల్లుపై అభిప్రాయాలు సేకరి౦చడానికి వడి వడిగా అడుగులేస్తోంది. ముఖ్యమంత్రి సహకారం లేకపోయినా తెలంగాణ ముసాయిదా బిల్లును ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు అవసరమైన వ్యూహాన్ని కూడా దిగ్విజయ్ సింగ్ రూపొందించినట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో తెలంగాణపై వెనక్కి తగ్గలేని స్థితికి కాంగ్రెసు అధిష్టాన చేరుకుంది. ఇదే విషయాన్ని దిగ్విజయ్ సింగ్ ముఖ్యమంత్రితో చెప్పినట్లు సమాచారం.అలాగే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసేందుకే తాను హైదరాబాదుకు వచ్చానని, ఊరూరా కాంగ్రెసు పార్టీ తెలంగాణ ఇచ్చిన ఘనతను చాటాలని టి కాంగ్రెసు నేతలకు డిగ్గీ సూచించారు.