బుధవారం నుంచి పార్లమెంట్
posted on Feb 4, 2014 @ 10:25AM
ప్రస్తుత 15వ లోక్‌సభ చివరి సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. అవినీతి నిరోధానికి సంబంధించిన బిల్లులు, మహిళా రిజర్వేషన్ బిల్లుతోపాటు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును కూడా ఈ సమావేశాల్లో ఆమోదించుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుస్తోంది. మొత్తం 39 బిల్లులను కేంద్రం క్యూలోపెట్టింది. అయితే ఈ సమావేశాల్లో బిల్లుల గురించి చర్చించకూడదని, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఒక్కదాన్ని ప్రవేశపెడితే సరిపోతుందని అనేక పార్టీలు సూచించినా కేంద్రం తన పట్టు విడిచిపెట్టలేదు. తెలంగాణ బిల్లు ఈ సమావేశాల్లో పెట్టడం మీద వచ్చిన అభ్యంతరాలనీ కేంద్రం పట్టించుకోవడం లేదు. సోమవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాడిగా వేడిగా చర్చ జరిగింది. సభలో సీమాంధ్ర ఎంపీలను కేంద్రం అదుపు చేయగలిగితే తెలంగాణ బిల్లు మీద చర్చకు ఒప్పుకుంటామని బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ కేంద్రానికి స్పష్టం చేశారు.