తెలంగాణ బిల్లుపై ప్రారంభమైన చర్చ
posted on Feb 18, 2014 @ 11:40AM
లోక్ సభ వాయిదా అనంతరం ప్రారంభమవగానే స్పీకర్ మీరా కుమారి ప్రశ్నోత్తరాలపై చర్చ చేపట్టారు. సీమాంధ్ర ఎంపీలు తమ ఆందోళనలను మాత్రం అదే విధంగా కొనసాగిస్తున్నారు. ప్లకార్డులు చేతపట్టి.. స్పీకర్ పోడీయంను చుట్టూ ముట్టి సమైక్యనినాదాలు చేస్తుండడంతో సభలో తీవ్ర గందరగోళ వాతవరణం నెలకొంది. వీరితో పాటు తమిళజార్లకు న్యాయం చేయాలంటూ తమిళ ఎంపీలు కుడా ఆందోళనకు దిగడంతో సభలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఆందోళకర పరిస్థితుల మధ్యే హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చకు అనుమతించాలని స్పీకర్ ను కోరారు. ఈ సమయంలో షిండే కు రక్షణగా తెలంగాణ ఎంపీలు చుట్టూ నిలబడ్డారు. చర్చ ప్రారంభమైనప్పుడు సభలో సోనియా, మన్మోహన్ సింగ్ లేరు. వెంటనే సభ మళ్ళీ 12.45 వరకు వాయిదా పడింది.