గందరగోళ౦గా తెలంగాణ ఆమోదం సరికాదు: జైరాం
posted on Feb 17, 2014 @ 11:02AM
తెలంగాణ బిల్లును గందరగోళ పరిస్థితుల మధ్య ఆమోదించడం సరికాదని, ముఖ్యమైన బిల్లులపై సభలో తప్పనిసరిగా చర్చ జరగాలని కేంద్ర మంత్రి, జీవోఎం సభ్యుడు జైరాం రమేశ్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ బిల్లుపై ఏకపక్షంగా వెళ్లడం సాధ్యం కాదని, బీజేపీతో కలిసి విస్తృత ఏకాభిప్రాయాన్ని కూడగట్టాల్సి ఉందని తెలిపారు. ఇప్పుడు బిల్లును అమోదించుకోవడానికి నాలుగు రోజులే సమయం మిగిలివుందని, అయినా బిల్లు ఆమోదానికి కావలిసిన మద్దతును కూడగడతామన్న విశ్వాసం తనకు ఉందని జైరాం రమేశ్ తెలిపారు. ఇప్పటికే హోం మంత్రి షిండేతో మాట్లాడానని, బిల్లు ప్రవేశపెట్టామని ఆయన స్పష్టం చేశారని, కమల్‌నాథ్ కూడా ఇదే విషయం చెప్పారని జైరాం తెలిపారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపైన జైరాం రమేశ్ మండిపడ్డారు. నాకు తెలిసినంత వరకు పార్టీ క్రమశిక్షణకు సంబంధించిన లక్ష్మణ రేఖను ఆయన దాటేశాడని వ్యాఖ్యానించారు.