తెలంగాణ నావల్లే వచ్చింది
posted on Nov 28, 2013 6:08AM
కేంద్రం తెలంగాణ ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు వేస్తుండటంతో ఈ ఘనత సాధించిన రికార్డును తమ ఖాతలో వేసుకోవడానికి అన్నిపార్టీలతో పాటు కొందరు జాతీయ నాయకులు కూడా తెగ ఆరాటపడిపోతున్నారు. మేము చేసిన సంప్రదింపులు, లాబీయింగ్‌ల వల్లే తెలంగాణ ప్రకటన వచ్చిందని ప్రతి సందర్భంలో చెపుతూ ఆ క్రెడిట్ తమకే సొంతం అని మురిసిపోతున్నారు.
ఇందులో భాగంగానే కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా సమాచారం తాను చేసిన కృషివల్లే తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు నిర్ణయం వెలువడిందని ఆయన అన్నారట. హైకమాండ్ పెద్దలను ఒప్పించడానికి తాను రాత్రింబవళ్లు ఎంతగానో కృషి చేశానని పేర్కొన్నట్లు సమాచారం. తాను లేకుంటే ఈ నిర్ణయమే వచ్చేది కాదని కూడా ఆయన తెగేసి చెప్పారట.
అయితే ఇవన్ని కేవలం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాడ ముఖ్యమంత్రి పదవి కోసం నేతలు ఇప్పటి నుంచే చేస్తున్న గ్రౌండ్ వర్క్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలంగాణ ఏర్పాటు తమ వల్లే సాద్యమయిందన్న మైలేజ్ ఇప్పటి నుంచే సొంతం చేసుకుంటే అది తరువాత కూడా తమకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారట నేతలు.