తెలంగాణ కొత్త జిల్లాల ఏర్పాటు రేపే..
posted on Oct 10, 2016 @ 6:20PM
తెలంగాణ ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఉన్న పదిజిల్లాలతో పాటు మరో 17 జిల్లాలు ఏర్పాటు చేయదలచుకున్న తెలంగాణ సర్కార్ పై ఇంకా కొన్ని ప్రాంతాలు జిల్లాలుగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడంతో మొత్తం 21 జిల్లాలు కొత్త జిల్లాలుగా ప్రారంభం కానున్నాయి. అయితే రేపు దసరా పండుగ రోజు సందర్బంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త జిల్లాలు ప్రారంభించనున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. అయితే ఏ జిల్లాను ఎవరు ప్రారంభిస్తారంటే?
* సిద్దిపేట- ముఖ్యమంత్రి కేసీఆర్
* జనగాం - శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్
* జయశంకర్ జిల్లా - శాసనసభాపతి మధుసూదనాచారి
* మెదక్ - ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి
* జగిత్యాల - ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ
* వరంగల్ గ్రామీణం - ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి
* యాదాద్రి - హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి
* పెద్దపల్లి - మంత్రి ఈటల రాజేందర్
* కామారెడ్డి: మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
* మంచిర్యాల- మంత్రి పద్మారావు
* వికారాబాద్- మంత్రి మహేందర్‌రెడ్డి
* రాజన్నసిరిసిల్ల- మంత్రి కేటీఆర్
* ఆసీఫాబాద్- మంత్రి జోగు రామన్న
* సూర్యాపేట- మంత్రి జగదీశ్‌రెడ్డి * కొత్తగూడెం- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
* నిర్మల్- మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
* నాగర్‌కర్నూల్ - మంత్రి జూపల్లి కృష్ణారావు
* మహబూబాబాద్- మంత్రి చందూలాల్
* జోగులాంబ - మంత్రి లక్ష్మారెడ్డి
* మేడ్చల్ (మల్కాజ్‌గిరి) - మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
* వనపర్తి- రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి