జూనియర్ ఎన్టీఆర్ తో టీమ్ ఇండియా క్రికెటర్లు
posted on Jan 17, 2023 @ 12:02PM
జూనియర్ ఎన్టీఆర్, క్రికెటర్లు కలిసి సందడి చేశారు. న్యూజిలాండ్ తో జరగనున్న వన్డే మ్యాచ్ కోసం టీమ్ ఇండియా క్రికెటర్లు హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ లో ఖరీదైన కార్ల కలెక్షన్ తో మీడియా దృష్టిని ఆకర్షించిన నజీర్ ఖాన్ నివాసంలో జరిగిన ఒక కార్యక్రమానికి టీమ్ ఇండియా క్రికెటర్లు కొందరు హాజరయ్యారు.
నజీర్ ఖాన్ వారికి స్నేహితుడు కావడంతో ఆయన ఆహ్వానం మేరకు క్రికెటర్లు వచ్చారు. అదే కార్యక్రమానికి హీరో ఎన్టీఆర్ కూడా హాజరయ్యారు. ఆర్ఆర్ఆర్ సినామాలోని నటనతో ఆబాలగోపాలాన్నీ తన అభిమానులుగా మార్చుకున్న ఎన్టీఆర్ కు టీమ్ ఇండియా క్రికెటర్లు కూడా అభిమానులే కావడంతో వారంతా ఎన్టీఆర్ తో ఫొటోలు దిగారు.
ఆ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయ్యాయి. వరల్డ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ ఫొటోలను ట్వీట్ చేశారుఎన్టీఆర్ ను కలిసిన వారిలో యుజ్వేంద్ర చహల్, శుభ్ మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్ తదితరులు ఉన్నారు.