టీం ఇండియాకు నేతల ప్రసంసల వెల్లువ
posted on Apr 3, 2011 @ 12:11PM
హైదరాబాద్: క్రికెట్‌లో ప్రపంచ కప్ సాధించిన మహేంద్ర సింగ్ ధోని సేనకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి అభినందనలు తెలియజేశారు. మ్యాచ్‌ను ఆదుకున్న గంభీర్ సింగ్‌కు కూడా సిఎం ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అలాగే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు కూడా ఇండియన్ క్రికెట్ టీమ్‌కు అభినందనలు తెలియజేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సభ్యుడు వై.ఎస్. జగన్మోహన రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. శ్రీలంకపై చిరస్మరణీయ విజయం సాధించిన టీమిండియాకు జగన్మోహన రెడ్డి అభినందనలు తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి విజయాలు సాధించాలని ఆయన అభినందించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు, మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి, లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాష్‌నారాయణ్, ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి, కాంగ్రెస్ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ఇంకా వివిధ పార్టీల నాయకులు, ఎంపీలు, ఎంఎల్యేలు టీం ఇండియాకు అభినందనలు తెలియజేశారు.