ఉద్యమానికి సిద్దమవుతున్న ఎయిడెడ్ టీచర్ల
posted on Jul 31, 2012 @ 11:37AM
రాష్ట్రంలోని ఎయిడెడ్ టీచర్లు తమ సమస్యల పరిష్కారానికై పెద్ద ఎత్తున ఉద్యమించాలని నిర్ణయించారు. విద్యా శాఖకు ఇద్దరు మంత్రులున్నా ఎయిడెడ్, మున్సిపల్ టీచర్ల సమస్యల పరిష్కారానికి వారు చొరవ చూపడంలేదని రాష్ట్ర ఉపాద్యాయ సంఘం ఆరోపించింది. యస్‌టియు ఆధ్వర్యంలో తమ న్యాయమైన డిమాండ్లకోసం ఎయిడెడ్ టీచర్లు వియవాడ సబ్‌కలెక్టర్ ఆఫీసు దగ్గర ధర్నా నిర్వహించారు. పేద, మధ్యతరగతి ప్రజలెక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న ఎయిడడ్, మున్సిపాలిటీ టీచర్లకు ప్రభుత్వ ఉపాద్యాయులకు ఇచ్చే సౌలబ్యాలను వర్తింపచేయాలని వారు కోరుతున్నారు.
మేనేజ్‌మెంట్ ఉపాద్యాయులకు ఇచ్చే ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, జిఎఎఫ్ , హెల్త్‌కార్డులు తమకు కూడా కల్పించాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వం 37/2005,1/2005 యాక్టుద్వారా నష్టపోయిన వారికి పైకం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఒక్కో పురపాలక సంఘంలో ఒక్కో జిఓ అమలు చేస్తున్నారని అన్ని చోట్లా ఒకే జీవో అమలు చేయాలన్నారు. కొన్ని చోట్ల 38, మరికొన్నిచోట్ల 146 నిబంధనలు వర్తింప చేయడాన్ని వారు గర్హించారు. ఎంతో ఆందోళన చేసి సాధించుకున్న ప్రీ ఆడిట్ ఉత్తర్యుల్లోనూ కొర్రీలు పెడుతుండటం పట్ల నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాద్యాయవాణి చీఫ్‌ఎడిటర్ మూకల అప్పారావు, జిల్లా ఉపాధ్యక్షుడు ఎంవియస్‌ఎన్ ప్రసాద్ ఎయిడెడ్, మున్సిపల్ టీచర్లు పాల్గొన్నారు.