Read more!

డామిట్ కధ అడ్డం తిరిగిందేమిటి?

 

 

నిన్న అర్థరాత్రి వరకు జరిగిన శాసనసభ సమావేశాలలో కాంగ్రెస్ మరియు ప్రతిపక్షాలు కూడా ఊహించని విదంగా ఎస్సీ. ఎస్టీ బిల్లుపై ఇర్రుకొని బయట పాడేందుకు నానా తంటాలు పడ్డాయి. రోజంతా వాడిగా వేడిగా సాగిన సమావేశాలతో సభలో సభ్యులు ప్రజలకోసం చలికాలంలో కూడా చెమటలు కక్కుతూ మరీ తమ ఉపన్యాసాలతో సభని హోరేత్తించేసారు. ఇక బిల్లు సభ ఆమోదం పొందడమే తరువాయి అనుకొంటుండగా, తె.దే.ప. బిల్లులో 12వ క్లాజుపై సవరణ ప్రతిపాదించడంతో అసలు డ్రామా మొదలయింది.


అంతవరకూ ఆ బిల్లు తెచ్చిన కీర్తి తన ఖాతాలో జమ చేసుకోవాలనుకొని తహతహలాడిన కాంగ్రెస్, తె.దే.పా. ప్రతిపాదనతో ఒక్కసారిగా సభలో కంగుతింది. అయితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తె.దే.ప. ప్రతిపాదనని యెంత తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ, సభాద్యక్షుడు నాదెండ్ల మనోహర్ తె.దే.ప. కోరిన విదంగా బిల్లుపై ఓటింగ్ కి అనుమతించడంతో ముఖ్య మంత్రి మరోసారి కంగుతిన్నట్లు కనిపించేరు. తీవ్ర ఉద్రిక్తతకిలోనయిన ఆయన స్పీకర్ నిర్ణయాన్ని తప్పు పట్టారు కూడా. కాని సభలో ఓటింగ్ తప్పలేదు.



తాము ప్రతిపాదించిన సవరణలకు మద్దతుగా సభలో అన్ని ప్రతిపక్ష పార్టీలు నిలబడేసరికి తె.దే.పా. కాంగ్రెసును ఓడించడం ఇక చాల తేలిక అని భావించింది. గాని, వై.యస్.ఆర్. కాంగ్రేసుకు చెందిన విజయమ్మ కొంచెం తతపటాయిన్చుతూ తె.దే.పా. ప్రతిపాదనకి మద్దతుగా లేచినిలబడగానే సభలో కొంచెం గందరగోళం ఏర్పడింది. దానితో మొదట తీసిన లెక్కని పక్కని బెట్టి స్పీకర్ మళ్ళీ మరోసారి వోటింగ్ నిర్వహించినప్పుడు తె.దే.ప. ప్రతిపాదనకి అనుగుణంగా 47 ఓట్లు, దానిని వ్యతిరేకిస్తూ కాంగ్రేసు సభ్యులు వేసిన 69 ఓట్లూ పోలవడంతో సభలో తె.దే.ప. ప్రతిపాదన వీగిపోయింది. దీనితో చావు తప్పి కన్ను లొట్టపోయినంత పనైంది ముఖ్యమంత్రికి. కాంగ్రెస్ ని ఇరికిన్చామనుకొన్న తే.దే.పా. మరియు విపక్షాలు కాంగ్రేసు చేత యస్సీ ఎస్టీ వ్యతిరేకులుగా ముద్ర వేయించుకొని దొరికిపోయారు.