మాజీమంత్రుల భార్యలకు జైలుశిక్ష
posted on Jul 7, 2012 @ 10:29AM
రాజకీయం నేర్చుకోమని భర్తల ప్రోత్సాహం ఒక్కోసారి విపరీత పరిస్థితులకు దారి తీస్తుందని గుండ్లకుంటలో జరిగిన సంఘటన నిరూపిస్తోంది. ఈ సంఘటనలో కీలకపాత్ర పోషించిన మాజీమంత్రుల భార్యలకు ఈ సందర్భంగా ప్రొద్దుటూరు కోర్టు జైలు శిక్ష విధించింది. ఆ ప్రోత్సాహం వల్ల మాజీ మంత్రి పి.శివారెడ్డి భార్య లక్ష్మిదేవమ్మ, మరో మాజీమంత్రి భార్య పి.ఇందిర తెలుగుదేశం కార్యకర్తలతో కలిసి 2006 నవంబర్1న పెద్దమాడిదం మండలం గుండ్లకుంట గ్రామంలోని వెలుగుపాఠశాల ప్రారంభోత్సవానికి వచ్చిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని, అధికారులను నిలదీశారు.
ఈ సందర్భంగా మాటల యుద్ధం జరిగింది. అది కాస్తా ముదిరి ఇరువర్గాల ఘర్షణకు దారి తీసింది. ఎమ్మెల్యేను అడ్డుకోవటంతో మొదలై వర్గవిభేదాలుగా మారటంతో మాజీమంత్రుల భార్యలపై అధికారులు కేసు పెట్టారు. 2006లో జరిగిన ఈ కేసు ప్రొద్దుటూరు కోర్టులో వాదనలు పూర్తయి తీర్పుకొచ్చింది. ఇద్దరు మాజీ మంత్రుల భార్యలకు రెండేళ్ల జైలు శిక్ష, పదివేలు రూపాయల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. అయితే ప్రస్తుతం వీరిద్దరూ బెయిల్‌పై విడుదలయ్యారు.