కృష్ణాజిల్లాలో వెలవెల పోతున్న తెలుగుదేశం పార్టీ
posted on Jul 10, 2012 9:00AM
చంద్రబాబు శిబిరం కృష్ణాజిల్లాలో బోసిపోతుంది. బాబు ఎన్ని తీపి కబుర్లు చెప్పినా ఎమ్మేల్యేలు పార్టీలో ఉండటానికి ఇష్ట పడటం లేదు. మొన్నటికి మొన్న నూజివీడు ఎమ్మేల్యే చిన్నం రామకోటయ్య పార్టీవీడిపోతానంటూ హడావిడి చేశారు.ఆయనను సముదాయించడానికి పార్టీ అధినేత నానా తంటాలు పడాల్సి వచ్చింది. అనంతరం గుడివాడ ఎమ్మేల్యే కొడాలి నాని వైసిపి నాయకులకు దగ్గరవుతున్నాడని తెలిసి చంద్రబాబునాయుడు స్వయంగా పిలిపించుకుని మాట్లాడారు. చంద్రబాబు రీసెంటుగా ఎంతబుజ్జగించినా, నాని విలేకర్లతో మాట్లాడుతూ నా రాజకీయ భవిష్యత్తును కాలమే నిర్ణయించాలని తాత్వికంగా అన్నారు. కాని సోమవారం వైసిపి గౌరవ అధ్యక్షురాలు విజయమ్మను కలిసారు. అది తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నేతలు తమ పార్టీ గౌరవాన్ని కాపాడుకునేందుకు అప్పటికప్పుడు సస్పెండు చేశారు. ఆ తరువాత నాని చెంచల్‌గూడ జైల్లో ఉన్న వైసిపి అధ్యక్షుడు వైయస్ జగన్ ని కలిసారు. దీనితో తెలుగుదేశం పార్టీ ప్రారంభకులైన ఎన్టీరామారావుగారి స్వంత జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఉనికిని ముప్పు వచ్చింది.
చంద్రబాబునాయుడు విజయవాడలో ఫ్లైఓవర్ నిర్మించాలని చేసిన ధర్నాలో కూడా నూజివీడు, గుడివాడ ఎంఎల్‌ఏలు పాల్గొనక పోవటం అనేక చర్చలకు తెరతీసింది. కాగా కొడాలి నాని పార్టీ వీడటం పై తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఉంటున్న సామాజిక వర్గానికి చెందిన వారే తెలుగుదేశంపై ఆసక్తి చూపటంలేదని తేలినట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీలో హరికృష్ట వర్గానికి చంద్రబాబు వర్గానికి పడటంలేదని వేరేపార్టీలో ఉంటేనే పురోభివృద్ది ఉంటుదనే ఉద్ధేశంతోనే కొడాలి నాని పార్టీనుండి బయటపడ్డారని వదంతులు ఉన్నాయి. దగ్గుబాటి దంపతులు కాంగ్రెస్ పార్టీలో ఉండటం మూలంగానే వారి రాజకీయ జీవితం అద్వితీయంగా ఉందని కుటుంబ సభ్యులు భావిస్తున్నట్లు తెలుస్తుంది. నాని పార్టీ మారటం వెనుక జూనియర్ ఎన్టీఆర్ పాత్ర ఉందనే ఊహలకి జూనియర్ ఎన్టీఆర్ మధ్యాహ్నం జరిపిన విలేకర్ల సమావేశం లో సమాధానం చెప్పారు.
గుడివాడతో తన తాతగారైన నందమూరి తారకరామారావుకి ఎంతో అనుబంధం ఉందని అందుకనే తనకు ఆ నియోజకవర్గమంటే ప్రత్యేక అభిమానమని చెప్పారు. నాని పార్టీ మారటపై తనకేమీ తెలియదని, తను మాత్రం బ్రతికున్నంతవరకు తెలుగుదేశం పార్టీలోనే వుంటానని, చంద్రబాబు నాయుడుకి,బాలకృష్ణకి తనకు తన తండ్రికి మద్య బేదాభిప్రాయాలు లేవని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. అయితే తెలుగుదేశం పార్టీ లో వలసలు ఇంతటితో ఆగిపోవని, వల్లభనేని వంశీ కూడా నానీ బాటే పడతారనే నాయకులు, కార్యకర్తలు కలవర పడుతున్నారు.