తమిళనాడు ప్రజలపై జయ వరాల జల్లు
posted on May 25, 2015 7:15AM
తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత బాధ్యతలు చేప్పట్టగానే రాష్ట్ర ప్రజలపై వరాల జల్లు కురిపించారు. ఆమె మొదటిరోజే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్న అమ్మ క్యాంటీన్లకు అధనంగా మరో 200 కొత్తగా ఏర్పాటు, నిరుపేద ప్రజలకు మంచి నీళ్ళు సౌకర్యం, అదేవిధంగా కుటుంబ భారం మోస్తున్న నిరుపేద మహిళల కోసం రూ.100 కోట్లతో ప్రత్యేక శిక్షణా సంస్థలు ఏర్పాటు, రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మరమత్తుల కోసం రూ.1,800 కోట్లు మంజూరు చేస్తూ ఆమె ఫైళ్ళపై సంతకాలు చేసారు. ఆమె అధికారంలో లేనప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ఓ.పన్నీర్ సెల్వం వాయిదా వేసిన అనేక కార్యక్రమాలను కూడా ఆమె త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉంది. వాటిలో ఎనిమిది నెలల క్రితమే సిద్దమయిన మెట్రో రైల్, ప్రభుత్వం కొనుగోలు చేసిన బస్సులను ఆమె త్వరలోనే ఆరంభించవచ్చును. అదేవిధంగా గత ఎనిమిది నెలలుగా వాయిదా వేసుకొస్తున్న చెన్నైలో నిర్వహించ వలసిన అంతర్జాతీయ పెట్టుబడిదారుల సమావేశాన్ని కూడా త్వరలోనే నిర్వహించవచ్చును.