బ్రేక్ తీసుకుంటారా?

కొంచెం బోర్ కొడితే చాలు ఎక్కడికైనా వెళ్లిపోవాలని అనిపిస్తుంది. ఇంట్లోనూ, బయట, ఉద్యోగంలో, సహా ఉద్యోగులతో, చుట్టాలు ఇంకా చుట్టుపక్కల గందరగోళ వాతావరణం వల్ల మనసు చాలా చికాకు పడుతుంది. "అబ్బా!! ఎక్కడికైనా పారిపోదాం బాస్" అని ఏదో ఒక మూమెంట్ లో ప్రతి ఒక్కరూ అనుకునే ఉంటారు, అనుకుంటూ వుంటారు. కానీ ఇప్పటి నుండి అలా అనుకోకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలి?? మనసు చికాకు పడకుండా ఉంటే చాలు అలా అనుకోకుండా హమ్మయ్య అనేసుకుంటాం.

ఈ గందరగోళం నుండి తప్పించుకోవడం ఎలా అనే ప్రశ్న ఏదైతే ఉందో అది మనిషిని మళ్ళీ ఆలోచనల్లోకి నెడుతుంది. కానీ వీటన్నిని దూరంగా తరిమెయ్యడానికి ఒక సొల్యూషన్ ఉంది. అదే బ్రేక్ తీసుకోవడం.

బ్రేక్ తీసుకోవడం ఏంటి అంటే……

చేసే పనులు నుండి చిన్నపాటి విరామం కావాలి మనిషికి. నిజానికి ఈ కాలంలో మనిషికి శారీరక శ్రమ అంటూ ఎక్కువ లేదు. ఊపిరి ఆడనివ్వని ట్రాఫిక్ జాముల్లో ప్రయాణం చేయడం, ఆఫీసుల్లో గంటల కొద్దీ సిస్టం ల ముందు కూర్చుని ఉండటం మాత్రమే శరీరానికి పని. మనిషికి మానసికంగా ఒత్తిడి పెరుగుతూ ఉంది కాబట్టే బ్రేక్ అవసరం. 

ఎలా ??..... ఇలా…..

బ్రేక్ తీసుకుని రిలాక్స్ అవ్వడం ఎలా అని అనుకుంటారు అందరూ. కొత్తదనం ఎప్పుడూ మనిషిని కొన్ని ఇర్రిటేషన్స్ నుండి బయటకు తీసుకొస్తుంది. అందుకే అక్కడక్కడే ఉక్కిరిబిక్కిలో ముంచే ప్రాంతాల్లో నుండి కాస్త దూరం వెళ్తుండాలి అప్పుడప్పుడు. ఇంట్లోనే ఒకే గదిలో 24 గంటలు ఉండాలంటే చెప్పలేనంత చిరాకు కలుగుతుంది. తప్పనిసరిగా అలా ఉండాల్సి వస్తే రోజు రోజుకు అది ఒత్తిడికి దారి తీస్తుంది. అలాంటిదే ఇక్కడ కూడా వర్తిస్తుంది. కాకపోతే గదుల లాంటి నుండి బయటపడగానే ప్రయాణం, ఆఫీసు, తోటి ఉద్యోగులు, అటు తిరిగి, ఇటు తిరిగి చివరికి మళ్ళీ ఇల్లు, ఇంట్లో గదిలో నిద్ర. కొందరికి అలా నిద్రపోవడం కూడా చెప్పరానంత అసహనం కలుగుతూ ఉంటుంది. అందుకే బ్రేక్ కావాలి. 

ఎటు వెళ్ళాలి??

కొత్తదనం అనేది మనిషిలోకి కొత్త ఎనర్జీని పాస్ చేస్తుంది. కొత్తదనం అంటే కొత్త బట్టలు కట్టుకుని మెరిసిపోవడం కాదు, మన పరిధిలో ఉన్న ఆలోచనలను మార్చేసుకోవడం కాదు. తాత్కాలిక ఉపశమనం అనేమాట వినే ఉంటారు కదా. టెంపరరీ రిలాక్సేషన్ అనేది మనిషి ఎప్పటికప్పుడు రీఛార్జి అవ్వడానికి సహాయపడుతుంది.  విహారాయత్రలు మనిషికి మానసికంగా ఊరట ఇవ్వడంలో పర్ఫెక్ట్ గా సహాయపడతాయి.

ప్రకృతికి దగ్గరగా పీస్ ఫుల్ గా!!

ఈ టెక్నాలజీ ప్రపంచం గురించి ఎంతన్నా చెప్పండి. అక్కడ కలిగే మానసికపరమైన ఒత్తిడిని తొక్కేసి మనిషిని తిరిగి ఉత్సాహవంతుడిగా చేసేది ప్రకృతి మాత్రమే. అదే గొప్ప మెడిసిన్. పచ్చదనం, చల్లని గాలి, చెట్ల నీడలు, మట్టి దారులు, పువ్వులు, పక్షుల కిలకిలలు, నీటి ప్రవాహాలు ఎంత గొప్ప ఊరట లభిస్తుందో  మాటల్లో చెప్పలేం. 

అవి మాత్రమే కాకుండా ఆసక్తికర ప్రదేశాలు, చరిత్రాత్మక ప్రాంతాలు, కట్టడాలు, వీటన్నిటికీ మించి ఆధ్యాత్మిక క్షేత్రాలు ఎంతో అద్భుతం. నిజానికి ఆధ్యాత్మిక క్షేత్రాలు ఎక్కడైనా ఉన్నాయంటే అవన్నీ ప్రకృతికి నిలయమైన పంచభూతాలు పుష్కలంగా ఉన్న చోటులోనే ఉంటాయి. అడవులు, కొండల మధ్య అలరారుతూ జటాయి.

రిలాక్సేషన్!!

రోజూ అవే రోడ్ లలో పడి ప్రయాణిస్తూ, అదే ఆఫీసులో నలిగిపోతూ, కుటుంబ బాధ్యతలను మోస్తూ మానసిక ఒత్తిడిలో మునిగి తేలుతున్నవాళ్ళు నచ్చిన ప్రాంతానికో, కొత్త ప్రదేశాలకో అపుడపుడు పోతుండాలి. అందుకోసమే బ్రేక్ తీసుకోవాలి.  రిలాక్స్ అయిపోవాలి.   

                             ◆వెంకటేష్ పువ్వాడ.