Read more!

విశాఖ సీటు పై మళ్లీ మొదలైన రగడ

 

 

 

 

విశాఖపట్నం నుంచి లోక్ సభకు తానే పోటి చెస్తానని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు టి. సుబ్బిరామిరెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం ఈ స్థానం నుంచి పురంధేశ్వరి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే పురంధేశ్వరిని నర్సాపురం నుంచి పోటికి దింపాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సుబ్బిరామిరెడ్డి చెప్పారు.


గతంలో సుబ్బరారెడ్డి విశాఖపట్నం నుంచి పోటీ చేసి విజయం కూడా సాధించారు. ఆ తర్వాత ఈ సీటును పురందేశ్వరికి కేటాయించగా ఆమె విజయం సాధించారు. సుబ్బరామిరెడ్డి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయన పదవికాలం కూడా ముగియవస్తున్న నేపద్యంలో ఆయన విశాఖపట్నంలో పోటీచేయాలని బావిస్తున్నారు.

గత ఏడాది నెల్లూరు కు జరిగిన లోక్ సభ ఉప ఎన్నికలో కూడా పార్టీ కోరిక మేరకు పోటీచేసి ఓడిపోయారు. అప్పుడే విశాఖ సీటు తనకు ఇవ్వాలన్న కండిషన్ పెట్టారని ప్రచారం జరిగింది. ఈ నేపధ్యంలో తానే విశాఖ నుంచి పోటీచేస్తానని ఆయన మళ్లీ ప్రకటించారు. అయితే విశాఖపట్నం నుంచి మారడానికి పురంధేశ్వరి ఇష్టపడడంలేదు. ఇంతకు ముందు విశాఖపట్నం సీటు నుంచి పోటీ చేసే విషయంపై పురంధేశ్వరికి, టి. సుబ్బిరామిరెడ్డికి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆఖరికి కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి ఛాన్స్ ఇస్తుందో చూడాలి.